టాలీవుడ్

‘బాక్’ చిత్రం నుంచి శివానిగా తమన్నా భాటియా, శివ శంకర్‌గా సుందర్ సి పరిచయం

‘అరణ్మనై’ తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.  అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి  హీరోగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి. తమన్నాని శివానిగా పరిచయం చేసారు. ఆమె సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు బాక్ లో కొన్ని స్పైన్ -చిల్లింగ్ ఎలిమెంట్‌ తో ఆకట్టుకున్నాయి.

హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ,  ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి  ఏపీ, తెలంగాణ లో భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక విభాగం:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్:  అవ్ని సినిమాక్స్ P Ltd.
తెలుగు రిలీజ్ : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago