పి. వి ఆర్ట్స్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించిన సినిమా ” మిస్టరీ “. వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్ నిర్మాతలు గా , తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమా ” మిస్టరీ’. ఈ సినిమా నవంబర్ 7 న ఆహా ఓటిటి లో విడుదలైనది. విడుదలైన 24 గంటల్లోనే లక్షల్లో వ్యూయర్ షిప్ ని సాధించింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. తనికెళ్ళ భరణి, సుమన్, అలీ, జబర్దస్త్ సత్య,ఆకెళ్ళ, గడ్డం నవిన్, రవి రెడ్డి, వెంకట్ పులగం, ముఖ్య పాత్రలు చేశారు మంచి ఎఫర్ట్ పెట్టారు, ఇక పోతే మా హీరోయిన్ స్వప్న చౌదరి 5 పాత్రల్లో నటించి మెప్పించింది. హ్యూమరస్ కామెడీ తో తీసిన ఈ సినిమా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది, ప్రేక్షకులు మా సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను.

