యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా…మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ ‘‘చాలా సంవత్సరాలుగా ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో మంచి సినిమా చేయలేనా అనే బాధ ఉండేది. రాజా రవీంద్ర రూపంలో వచ్చింది. ఆయనతో నాకు పరిచయం లేదు. మెహర్ రమేష్ గారి మాట మేరకు పిలిచి అవకాశం ఇచ్చారు. దండుపాళ్యం సినిమాకు నేను పెద్ద ఫ్యాన్. అలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరాజుగారితో పని చేయటం చాలా ఆనందమేసింది. టెక్నీషియన్ ఫ్రెండ్లీ డైరెక్టర్. నా దగ్గరుండి అన్నీ రకాలైన పాటలు చేయించారు. భద్ర ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థతో రీ ఎంట్రీ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ ‘‘భ్రద ప్రొడక్షన్స్ సంస్థకు అభినందనలు. ఈ సంస్థ లేకుండా ఉండుంటే శ్రీనివాసరాజుగారు లేరు.. ఆయన లేకుంటే మా దండుపాళ్యం గ్యాంగ్ లేదు. శ్రీనివాసరాజుగారితో 12 ఏళ్ల అనుబంధం ఉంది. దండుపాళ్యం గ్యాంగ్‌గా మళ్లీ నటించాం. కోవిడ్ సమయంలోనూ మేం షూటింగ్ చేశాం. మేకర్స్ మమ్మల్ని చక్కగా చూసుకున్నారు. నవీన్ చంద్ర చాలా మంచి వ్యక్తి. బాగా యాక్ట్ చేశాడు ప్రతి నిమిషాలకు సినిమాలో ట్విస్ట్ ఉంటుంది. రొమాన్స్, లస్ట్, రివేంజ్, డ్రామా అన్నీ ఉంటాయి’’ అన్నారు.పూజా గాంధీ మాట్లాడుతూ ‘‘దండుపాళ్యం ప్రయాణం స్టార్ట్ చేసి 12 ఏళ్లు అవుతుంది. శ్రీనివాసరాజుగారు మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. మా గ్యాంగ్ ఉన్నచోట మ్యాజిక్ జరిగింది. తగ్గేదే లే చిత్రానికి కూడా అది తప్పకుండా జరుగుతుంది. మంచి సబ్జెక్ట్. అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాజా రవీంద్రగారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చక్కగా హ్యాండిల్ చేశారు. నా తెలుగు స్ట్రైట్ మూవీ. తెలుగు ప్రేక్షకులు సినిమాను లవ్ చేసే విధానం నాకు ఎంతో నచ్చుతుంది. వారికి హ్యాట్సాఫ్. వారి వల్ల ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఇన్‌స్పిరేషన్ వస్తుంది. నవంబర్ 4న వస్తోన్న మా తగ్గేదే లే సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ ‘‘భ్రద ప్రొడక్షన్స్ సినిమా చేయాలనుకున్నప్పుడు రాజా రవీంద్రగారు చాలా కథలు విని, చివరకు శ్రీనివాసరాజుగారి కథను ఎంచుకున్నారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టబోతున్నారని అర్థమైంది. పి.పి.రెడ్డిగారు తొలిసారి సినీ పరిశ్రమలోకి ప్రొడక్షన్‌లో అడుగు పెడుతున్నారు. నవీన్ చంద్ర జర్నీ నాకు ఫస్ట్ నుంచి తెలుసు. బాగా కష్టపడే హీరో. సినిమా సినిమాకు ఎదుగుతున్నాడు. మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఈ సినిమా కూడా తనకు హిట్ అవుతుంది. శ్రీనివాసరాజుగారు క్రియేట్ చేసిన దండు పాళ్యం ప్రపంచం.. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ మధ్యలో జరిగింది. ఆ సమయంలో షూటింగ్‌లు కూడా జరగక అందరికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ భద్ర ప్రొడక్షన్ మాత్రం ముందు అందరికీ పేమెంట్స్ ఇచ్చేశారు. వ్యాక్సినేషన్ చేయించారు. నిర్మాత పీపీ రెడ్డి గారికి థాంక్స్. ముందు లవ్ స్టోరీ అన్నారు. రొమాన్స్ చాలా ఎక్కువ ఉంది ఎలా అని అనుకున్నాను. కానీ ఇందులోకి సడెన్‌గా దండుపాళ్యం గ్యాంగ్ వచ్చింది. మూడు స్టోరీలను ఇందులో అద్భుతంగా సెట్ చేశారు.
లవ్, యాక్షన్, వెంజెన్స్ ఇలా అన్నీ కూడా ఇమడ్చి పెట్టారు. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. అందరికీ సినిమా నచ్చుతుంది. మకరంద్ లాంటి నటులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అనన్య, దివ్యలు అద్భుతమైన నటులు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 4న ఈ చిత్రం రాబోతోంది. పీపీ సార్.. మళ్లీ మాకు చాన్స్ ఇవ్వండి. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఏ కథ అయినా ఎక్కడి నుంచి ఒక చోట జరిగిన వాటి నుంచి స్పూర్తి పొందుతారు. అలాంటి యథార్థ ఘటనలను చెప్పేందుకు మా భద్ర ప్రొడక్షన్ సంస్థను స్థాపించాం. ఇది మా మొదటి చిత్రం. ఈ తగ్గేదేలే మూవీ అనేది దండుపాళ్యం నుంచి స్పూర్తిపొందాం. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాం. కరోనా సమయంలో ఎంతో కష్టపడి సినిమాను నిర్మించాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దివ్య పిళ్లై మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. భద్ర ప్రొడక్షన్ మొదటి చిత్రం కావడం, నాకు కూడా ఇదే మొదటి సినిమా ఆవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు థాంక్స్. ఇలాంటి టీంతో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నటీనటులందరూ నాకు ఎంతో సహకరించారు. భద్ర ప్రొడక్షన్స్ మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు’ అని అన్నారు.అనన్య రాజ్ మాట్లాడుతూ.. ‘స్టోరీ విన్న వెంటనే నాకు నచ్చింది. నాకు ఈ కథలో నటించాలని ఉందని చెప్పా. వెంటనే పది నిమిషాల్లో అంతా జరిగిపోయింది. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. పోస్టర్‌లో నేను ఎంతో సీరియస్‌గా కనిపిస్తున్నాను. కానీ నిజ జీవితంలో మాత్రం నేను చిన్న పిల్లలా ఉంటాను. నాకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నవీన్ చంద్ర చాలా మంచి నటుడు. దండుపాళ్యం గ్రూప్‌కు చాలా థాంక్స్. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నవంబర్ 4న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ.. ‘ మంచి నటీనటులు, ప్రొడక్షన్ కంపెనీ దొరకడంతోనే ఈచిత్రం సాధ్యమైంది. నిర్మాత పీపీ రెడ్డి చేయి చాలా మంచిది. ఇలాంటి నటీనటులు లేకపోతే.. ఈ సినిమాను చేసి ఉండేవాడ్ని కాదు. ఈ చిత్రానికి అన్నీ కుదిరాయి. కరోనా రెండో వేవ్ ఎంతో కష్టంగా గడిచింది. నా తండ్రిని నేను కోల్పోయాను. అలాంటి దశలోనూ మీరంతా నాకు సపోర్ట్‌గా నిలిచారు. మీరంతా లేకపోతే ఈ చిత్రం పూర్తయ్యేది కాదు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి గారు మంచి చిత్రాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. బాహుబలి వంటి పది సినిమాలను తీయగల సత్తా ఉంది. కానీ మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనాలో కష్టపడి పని చేశాం. అందరికీ వ్యాక్సినేషన్ చేయించి సొంత మనుషుల్లా చూసుకున్నారు. చాలా హ్యాపీగా పని చేశాం. ఇలాంటి సినిమాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’ అని అన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…