సత్యం వధ ధర్మం చెర చిత్రం మార్చి 31న విడుదల

వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్ మరియు  త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్న చిత్రం “సత్యం వధ ధర్మం చెర”. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్.

దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ “కథలు చిన్న పిల్లలకి నిద్రపుచ్చడానికి చెప్తు ఉంటాం, కానీ పెద్దమనుషులను మేలుకొలపటానికి కూడా కొని కథలు చెప్పాలి. “సత్యం వధ ధర్మం చెర” చిత్ర కథ మన నిజజీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే. మనం ప్రతి రోజు ఇలాంటి వార్తలు పేపర్ లో చదువుతూ ఉంటాం లేదా న్యూస్ చానెల్స్ లో చూస్తూ ఉంటాం. మన రాజ్యాగం చాలా గొప్పది, మన చట్టం  చాలా గట్టిది, కానీ బాధితుడు చిన్నవాడు కారకుడు పెద్దవాడు అయితే ఈ చట్టం రకరకాలుగా పని చేస్తుంది. మరి నిజంగా చట్టం ఎలా పనిచేయాలో మా చిత్రంలో చుపించాము. సమాజంలో జరిగిన కొని నిజ సంఘటనల ఆధారంగా మా చిత్ర కథని తయారు చేసుకున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి 31న విడుదల కానుంది” అని తెలిపారు .

హీరోయిన్ పూజ మాట్లాడుతూ “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అందరు మా “సత్యం వధ ధర్మం చెర” చిత్రాన్ని ఆదరిస్తారు” అని కోరుకున్నారు.

మరో నటి మధుబాల మాట్లాడుతూ “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. నాది చాలా కీలక పాత్ర. బాలకృష్ణ గారి సినిమా డైలాగు తో ఒక పాట ఉంటుంది. ఆ పాట లో నేను నటించాను. ఆ పాట బాలకృష్ణ ఫాన్స్ కి పండగల ఉంటుంది. మా సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది ” అని తెలిపారు.

స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా, రాధికా చౌదరి, అర్జు,  మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనంతలక్ష్మి, నాని ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్. ఓ: పాల్ పవన్, డిజైనర్: కోడి ఎన్.ప్రసాద్, కాస్ట్యూమ్స్: మెహబూబ్, మేకప్: ఆర్.జగదీష్, కొరియోగ్రఫీ: ఆర్.కె., ఆర్ట్: జె.ఎన్.నాయుడు, కో-డైరెక్టర్: ఎమ్.బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.కె.పి. చౌదరి, సమర్పణ: వై.కొండయ్య నాయుడు, నిర్మాత: ఎదుబాటి కొండయ్య, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్సకత్వం: బాబు నిమ్మగడ్డ!!

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago