సుశాంత్ మహాన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Must Read

సోషల్ మీడియాలో ఫన్‌మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో ఫన్‌మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ కొత్త చిత్రానికి సంబంధించి సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, అందులో ఇచ్చిన హింట్లను నిశితంగా గమనిస్తే సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఏదో అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

హీరో సుశాంత్ మహాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక ఈ పోస్టర్‌లో హీరో రగ్డ్ లుక్, ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా.. అందులో కొన్ని హింట్లను కూడా వదిలారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరి దృష్టిని తమ వైపు లాక్కుని ఫన్ మోజీ టీం సక్సెస్ అయింది. ఈ మూవీ నుంచి మున్ముందు మరిన్ని అప్డేట్లు రానున్నాయి.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News