సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ అనే సినిమా రాబోతోంది. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీ నుంచి వదిలిన పోస్టర్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 7న సినిమాను విడుదల చేయబోతోన్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరోలిద్దరూ వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాహుల్ శ్రీవాత్సవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రాంతి ఆచార్య వడ్లూరి ఎడిటర్‌గా సనల్ అనిరుధన్ పని చేశారు.
తారాగణం : విశ్వంత్ దుద్ధుంపూడి, అనురూప్ కటారి, విస్మయ తదితరలు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఏ. ప్రశాంత్
దర్శకులు : ఆదిత్య రెడ్డి కుందూరు
కెమెరామెన్ : రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం : క్రాంతి ఆచార్య వడ్లూరి
ఎడిటర్ : సనల్ అనిరుధన్
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…