సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, దేవుడిలంటి మనిషీ పుస్తక ఆవిష్కరణ
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం బు ర్రి పాలం లో జరిగింది. బుర్రి పాలం గ్రామ ప్రజల ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. హీరో సుదీర్ బాబు , కృష్ణ గారి కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని , జయ , రమేశ్ బాబు భార్య మృదుల, నన్నపనేని రాజకుమారి, నిర్మాతలు అచ్చిరెడ్డి, శాఖమూరి మల్లికార్జునరావు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీనియర్ film journalist vinayakarao రచించిన దేవుడి లాంటి మనిషి పుస్తకాన్ని సుధీర్ బాబు ఆవిష్కరించి ఆదిశేషగిరిరావు కు తొలి కాపీ అందించారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణ గారిలా నేను కూడా సినిమాను ఇష్టపడి, కష్టపడి ఈ రంగంలో కి వచ్చి మి అందరి అభిమానాన్ని పొందాను. బు ర్రి పాలం లో జరిగిన కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నాను. అలాగే వినాయకరావు గారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం నా చేతుల మీదుగా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణగారు ఎప్పటికీ నంబర్ వన్. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వినాయకరావు గారు పుస్తకం రాయడం అభినందనీయం అన్నారు. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ. కృష్ణగారు నిర్మాతల హీరో. ఆయన నిజంగానే దేవుడి లాంటి మనిషి. ఆ విషయాన్ని ఈ పుస్తకం లో వినాయకరావు గారు చక్కగా ఆవిష్కరించారు అన్నారు
నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ బు ర్రి పాలం గ్రామంలో అన్నయ్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు మూడేళ్ల పాటు శ్రమించి అద్భుతమైన సమాచారం తో దేవుడి లాంటి మనిషి పుస్తకం రాశారు. చరిత్రకు అద్దం పట్టే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. అన్నారు.
చివరిగా పుస్తక రచయిత వినాయకరావు మాట్లాడుతూ కృష్ణగారీ కోరిక మీదే ఈ పుస్తకాన్ని అదనపు హంగులతో రెండో సారి తీసుకు వచ్చాను. అయితే ఈ పుస్తకాన్ని చూడకుండానే ఆయన ఆయన మనకు దూరం కావడం విచార కరం. కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉంది..అన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…