సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్‌లో రజినీ స్టైల్, ఆ నవ్వు, ఆ గన్ను పట్టిన విధానం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించడంతో దసరా పోటీ రసవత్తరంగా మారేట్టు కనిపిస్తోంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగాణం : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు
సాంకేతికబృందం
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రచయిత & దర్శకుడు: టీ.జే. జ్ఞానవేల్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి
ప్రొడక్షన్ డిజైనర్: కె. కధీర్
యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
క్రియేటివ్ డైరెక్టర్: బి కిరుతిక
ఆర్ట్ డైరెక్టర్: శక్తి వెంకట్ రాజ్
మేకప్: బాను బి – పట్టాణం రషీద్
కాస్ట్యూమ్ డిజైన్: అను వర్ధన్ – వీర కపూర్ – దినేష్ మనోహరన్ – లిజి ప్రేమన్ – సెల్వం
స్టిల్స్: మురుగన్
పబ్లిసిటీ డిజైన్: గోపీ ప్రసన్న
VFX పర్యవేక్షణ: లవన్ – కుసన్
టైటిల్ యానిమేషన్: ది ఐడెంట్ ల్యాబ్స్
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
సౌండ్ మిక్సింగ్: కన్నన్ గణపత్
రంగు: రఘునాథ్ వర్మ
DI: B2H స్టూడియోస్
DIT: GB రంగులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్
లైకా ప్రొడక్షన్స్ అధినేత : G.K.M. తమిళ కుమరన్, సుభాస్కరన్ నిర్మించారు
లేబుల్: సోనీ మ్యూజిక్
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…