టాలీవుడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్

సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ… నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రీరిలీజ్ వలన నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారు, ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు.

నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారు అన్నారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమాలో ఉన్న సీతారాం పాత్ర మహేష్ బాబు కు చాలా దగ్గర ఉంటుందన్నారు. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు. మే 30 వ తేదీన థియేటర్ లు బద్దలు అవుతాయి అన్నారు. రీ రిలీజ్ సినిమాల్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేస్తుంది అన్నారు. అలాగే నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ.. సినిమా అందరిని అలరిస్తుంది అని చెప్పారు.

అలీ మాట్లాడుతూ.. సినిమాను తీయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు అన్నారు. ఖలేజా సినిమా టీవీ లలో రికార్డ్ క్రియేట్ చేసింది అన్నారు. ఏ దేశం వెళ్లిన ఖలేజా గురించి మాట్లాడుతారు అని అన్నారు. సినిమాను త్రివిక్రమ్, మహేష్ బాబు ప్రాణం పెట్టి చేశారు అన్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ అనడం కన్నా డైరెక్ట్ రిలీజ్ అంటే బెటర్ అని అన్నారు. సినిమాకు ఇప్పటికి కల్ట్ ఫాన్స్ ఉన్నారు అని, మే 30 థియేటర్ లో చూద్దాం అని అన్నారు.

ఏసియన్ సునీల్ నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రెష్ రిలీజ్ లా ఉందన్నారు. ఓపెన్ చేసిన నిముశాలలొనే టికెట్స్ బుక్ అవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, షఫీ తదితరులు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు :శింగనమల రమేశ్, సి. కళ్యాణ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ : యష్ భట్, సునీల్ పటేల్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్
పీఆర్ఓ: హరీష్, దీనేష్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

4 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago