టాలీవుడ్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’ ట్రైలర్ కు అనూహ్య స్పందన

హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ‘భవనమ్’ ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయగా అనూహ్య స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను, జానపద పాటయైన యాదమ్మ.. సాంగ్ ను మంగళవారంనాడు ప్రసాద్ ల్యాబ్ లో విడుదలచేసి విలేకరులకు ప్రదర్శించారు. ఈ సాంగ్ జానపద బాణీలతో వుంటూ అలరించింది. ట్రైలర్  మరింత ఆకట్టుకుంది.

అనంతరం ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ,మా బేనర్ లో ఇది 95 వ సినిమా. మలయాళంలో 96 వ సినిమా చేస్తున్నాం. అలాగే 97, 98 సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో  100 సినిమాలకు చేరుకోబోతున్నాం. దర్శకుడు బాలాచారి భవనమ్ సినిమాను చక్కగా తీశాడు. ఆల్ రెడీ సాంగ్స్ వెరీ గుడ్. సంగీత దర్శకుడు చరణ్  గొప్ప టాలెంట్ పర్సన్. ఇందులో పనిచేసిన అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, రామ్ చరణ్ రచ్చలో ..మిల్క్ మిల్క్ చిలక.. పాట చేశాను. అదే నన్ను బతికిస్తుంది. అదే సూపర్ గుడ్ బేనర్ లో మరో అవకాశం దక్కేలా చేసింది. నల్గొండ గద్దర్ నర్సన్న.. రేవంత రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పాట పాడారు. ఆ పాట విన్న దర్శకుడు బాలాచారిగారు యాదమ్మ.. పాటను నర్సన్న తో పాడించారు. తనకు ఈ సినిమా నుంచి మంచి విజయాలు దక్కాలి.ఈ పాటటకు మంగ్లీ వాయిస్ చాలా ప్లస్ అయింది. ఇలా అందరి కాంబినేష న్ లో పనిచేయడం నాకూ చాలా ఆనందంగా వుంది. నిర్మాత అంజన్ కుమార్ సపోర్ట్ మర్చిపోలేను. నాకు గతంలో లారెన్స్ నన్ను ప్రోత్సహించారు. అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విఎస్.ఆర్. మాట్లాడుతూ, సూపర్ గుడ్ అంటే గౌరవం. అదే సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి, చరణ్ కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.

నల్గొండ గద్దర్ నర్సన్న మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజకీయ నేపథ్య పాటలు పాడినా త్రుప్తి లేదు. కానీ ఒక్క సినిమా చేయాలనే కోరిక ఇరవై ఏళ్ళుగా వుంది. స్నేహితుడు చరణ్ అర్జున్ ఏదోరోజు నీకూ వస్తుంది అని ప్రోత్సహించారు. భవనం లో   నా పాటకు డాన్స్ లు వేయడం మర్చిపోలేని అనుభూతి కలిగించింది. యాదమ్మ పాటలో జానపదబాణీలకు చరణ్ చక్కటి బాణీలు సమకూర్చారు. రచయితలు చక్కగా ప్రాసలతో రాశారు అన్నారు.

నటి స్నిగ్థ మాట్లాడుతూ, ఆర్.బి. చౌదరి గారి నిర్మాణ సంస్థలో చేయడం గొప్ప వరం.. ఈ మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ రోప్ కట్టి నాతో కఠినమైన ఫైట్లు కూడా చేయించారు. అవి తెరపై బాగుంటాయి. పాటలు చాలా బాగున్నాయని అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ ఆంథోని మాట్లాడుతూ, ప్రేమలు సినిమా చేశాను హిట్ అయింది. ఇది కూడా కావాలని కోరుకుంటున్నానన్నారు.

కొరియో గ్రాఫర్ శ్యామ్ తెలుపుతూ, ఆర్.బి. చౌదరి బేనర్ లో చేయడం అద్రుష్టం. అదే సక్సెస్ అనుకుంటున్నాను. దర్శకుడు నమ్మి అవకాశం ఇచ్చారు. యాదమ్మ సాంగ్ లో షలకలశంకర్, సప్తగిరి. బిత్తిరి సత్తి.. స్నేహా ఉల్లాల్ బాగా నటించారు. సాంగ్ హిట్ కావాలి. ఈ సాంగ్ ను అందించిన నల్గొండ గద్దర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

బిత్తిరి సత్తి మాట్లాడుతూ, సూపర్ గుడ్ లోగో అనేది పెద్ద బ్రాండ్. గతంలోనే సినిమా చేయాలనుకున్న నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. దర్శకుడు నా పాత్రను సరికొత్తగా క్రియేట్ చేశారు. ఇదంతా టీమ్ వర్క్. పాటల్లో సోల్ వుంది అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

చిత్ర దర్శకుడు బాలాచారి మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో ఇరవై ఏల్ళ నాడు విద్యార్థి చేశాను. మరోసారి చౌదరి గారు అవకాశం ఇచ్చారు. చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. విఎస్ ఆర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనంతో మరింత బాగా భవనమ్ సినిమా వచ్చింది అన్నారు.

షకలకల శంకర్ మాట్లాడుతూ, తనదైన శైలిలో మాట్లాడుతూ, దర్శకులు ఓ భవనాన్ని కట్టి మా చేత కూలీలుగా చేయించారు. గ్రుహ ప్రవేశం కోసం మేం వెయిట్ చేస్తున్నాం. నాకు సూపర్ గుడ్ అనే పేరు ఎంతో ఇష్టం. చిన్నతనంలో చదువుకన్నా థియేటర్లలో ఎక్కువగా వుండేవాడిని సూపర్ గుడ్ లోగో చూసి బొమ్మలు వేసేవాడిని. అలా అగ్రహీరోల బొమ్మలు కూడా వేశాను. ఇప్పుడు అటువంటి గొప్ప సంస్థలో నటించడం చాలా ఆనందంగా వుంది. హార్రర్ సినిమాలు తీసే వారు ఆశ్చర్యపరిచేలా మా దర్శకుడు సినిమాను తీశారు. ప్రేక్షకులకు గగుర్పాటును కలిగించడంతోపాటు కడుపుప్ప నవ్విస్తుంది అన్నారు.

అతిథి దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో 95 వ సినిమాగా భవనమ్ రావడం ఆనందంగావుంది.  ఎవిఎం. సురేష్ సంస్థలా త్వరలో  100 సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ బేనర్ లో వచ్చే సినిమాలలో ఆడియో చాలా బాగుంటుంది. అలా ఇందులో పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు.

TFJA

Recent Posts

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్…

3 hours ago

Grand Launch the Movie Marrichettu Kinda Manollu

Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…

3 hours ago

సుమంత్ ప్రభాస్, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తన తొలి మూవీ ‘మేం ఫేమస్‌’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…

4 hours ago

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…

1 day ago

డ్రింకర్ సాయి సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…

1 day ago

Aaron Taylor-Johnson Gives Fans An Insight Into How He Got Into Shape For Kraven The Hunter

Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…

1 day ago