విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ చిత్ర బృందం నేడు తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ నాయుడు గారు మాట్లాడుతూ… “ముందుగా మా సినిమా ట్రైలర్ ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసిన శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి, విద్యార్థులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ చేతుల మీదుగా ఈ వేడుక జరగడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత సాయి గారు. ఎక్కడా రాజీపడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక మా హీరో అమర్ దీప్ గారు, మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే అద్భుతమైన నటన కనబరిచారు. షూటింగ్ సమయంలో చేతికి తీవ్రమైన గాయమైనా, సర్జరీ జరిగే పరిస్థితి వచ్చినా, సినిమా కోసం ఆ బాధను భరించి షూటింగ్ పూర్తి చేశారు. ఆయన డెడికేషన్ మాకు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా మిత్రుడు తేజ ఇందులో చాలా మంచి పాత్ర చేశాడు, కామెడీతో పాటు సస్పెన్స్, డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మహేష్ విట్టా గారు సర్పంచ్ పాత్రలో రొమాంటిక్ యాంగిల్ లో అలరిస్తారు. హీరోయిన్ శైలి తన అందం మరియు నటనతో ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ఈ చిత్రం మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది, అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సుధాకర్ గారు మాట్లాడుతూ… “శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో మా ‘సుమతి శతకం’ ట్రైలర్ లాంచ్ జరగడం, ఇక్కడ విద్యార్థుల నుండి వచ్చిన స్పందన చూడటం చాలా ఆనందంగా ఉంది. మేము మా ప్రమోషన్ కార్యక్రమాలను రాయలసీమ నుంచే ప్రారంభించాము. కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లో ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నిన్న నా సొంత ఊరు మదనపల్లిలో, మరియు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో మాకు దక్కిన రెస్పాన్స్ మరువలేనిది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ ద్వారా ఫిబ్రవరి 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం పక్కా కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మిమ్మల్ని అలరిస్తుంది. ఈ వేడుక నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ జయచంద్ర గారికి, విద్యార్థులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ తప్పకుండా థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

హీరోయిన్ షైని మాట్లాడుతూ… “మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ ఎనర్జీ చూస్తుంటేనే చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. ఇప్పుడే మీరు మా సినిమా ట్రైలర్ చూశారు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మేము ఎంతో ప్రేమతో, కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాము. మీ ఆదరణ మాకు ఎంతో ముఖ్యం, మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ‘సుమతి శతకం’ సినిమాను థియేటర్లలో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి” అన్నారు.

హీరో అమర్‌దీప్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉన్న పాజిటివ్ వైబ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ ‘రామ’ అనే పేరుతోనే మొదలైంది. ఇప్పుడు అదే పేరున్న కాలేజీలో మా ‘సుమతి శతకం’ ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మంచి సెంటిమెంట్‌గా భావిస్తున్నాను. నేను కూడా మీలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌ని, మీ ఎనర్జీ చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. అనంతపురంలో ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చిన నాకు మీరు ఎంతో ప్రేమను అందించారు. ఈ సినిమా కోసం నా ప్రాణం పెట్టి పనిచేశాను. షూటింగ్ సమయంలో గాయాలైనా వెనకాడకుండా కష్టపడ్డాను. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వండి, నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటాను. మా సినిమా కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ‘సుమతి శతకం’ను థియేటర్లలో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ ముగించారు.

నటీనటులు : అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం : ఎంఎం నాయుడు
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి
బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మాలపాటి శ్రీధర్
సినిమాటోగ్రాఫర్ : ఎస్ హలేష్
ఎడిటర్ : నహిద్ మహమ్మద్
సంగీతం : సుభాష్ ఆనంద్
డైలాగ్స్ : బండారు నాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం

