దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం యూనిట్ బుధవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు జీనియస్ సన్సేషనల్ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసమావేశంలో
సుకుమార్ మాట్లాడుతూ ” సుకృతికి చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. తనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ దర్శకురాలు పద్మ, నిర్మాతల్లో ఒకరైన సింధు యాక్టింగ్‌కు ఒప్పించారు. ఈ ఇద్దరిది సినిమా విషయంలో ఎంతో పెద్ద జర్ని. సుకృతి నటిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నమ్మకం లేదు. కానీ దర్శకురాలు పద్మని అడిగితే మాత్రం బాగా నటిస్తుంది అని చెప్పేది. మెహమాటానికి సినిమా చేయకు అని చెప్పాను. కానీ సుకృతి యాక్టింగ్ చూసిన తరువాత షాక్ అయ్యాను. అంత బాగా నటించింది. నా కూతురు ఈ సినిమాలో బాగా చేసింది అని చెప్పడానికి నేను ఏ మాత్రం సందేహించను. ఈ సినిమాను పద్మ, సింధులు ఎంతో కష్టపడి పట్టుదలతో పూర్తిచేశారు. కథ బాగా చెప్పగలిగితే సినిమా బాగా తీయగలరు. దర్శకురాలు కథ బాగా చెప్పింది అదే విధంగా ఈ సినిమా అంతే సూపర్‌గా తెరకెక్కించింది. ఈ సినిమా సుకృతి లైఫ్‌లో ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సినిమాలో అందరూ బాగా నటించారు. నవీన్, రవి గారు ఈ సినిమాను నిర్మించడం, విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మూడు గంటలు మనుషులను కూర్చొబెట్టి ఎంటర్‌టైన్ చేయగలిగితే ఆ మూడు గంటలు క్రైమ్ తగ్గిపోతుందని భావిస్తాను. ఎంటర్‌టైన్‌మెంటే మేసేజ్‌గా ఫీలవుతున్నాను. సినిమా అంటే బిజినెస్.. ఇన్వెస్ట్ చేసిన ఏదైనా బిజినెసే.. సినిమా కూడా అంతే.. ప్రేక్షకులను ఆనందిపంజేయడం, ఆనందింప జేయడమే నా దృష్టిలో సందేశమే. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేసేజ్ ఇచ్చే సినిమా చేయడం అదృప్టం. గాంధీ తాత చెట్టులో ఈ రెండూ ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ” సినిమా చూసిన తరువాత ఇంటెన్సిటి… సినిమాల్లో అందరి నటన చూసి ఇది డబ్బులు తెచ్చే సినిమా అనిపించింది.ముఖ్యంగా సుకృతి నటన చాలా బాగా చేసింది. పెద్ద ఆర్టిస్ట్‌లా, అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌లా సుకృతి చేసింది. అందరికి చిన్నారి చేతన, లిటిల్‌సోల్జర్స్ సినిమాలను గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో కలిసి చూడాలి. అందరి హృదయాలను హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్‌లో రీచ్ అవుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ” ఈ సినిమాను ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా చూశాను. ఈ సినిమా నాకెంతో బాగా నచ్చింది. సుకృతి పర్‌ఫార్మెన్స్ ఎక్స్‌టార్డనరీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.
సమర్పకురాలు తబితా సుకుమార్ మాట్లాడుతూ ” సుకృతి ఇంత బాగా నటిస్తుందని నాకు తెలియదు. తాను మంచి సింగర్ అని తెలుసు కానీ నటిస్తుందని అనుకోలేదు. ఈ సినిమాను ఫెస్టివల్స్‌కు వెళితే చాలు అనుకున్నాను. అవార్డులు వచ్చిన తరువాత అందరూ అప్రిషియేట్ చేస్తుండటం చూసి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి సపోర్ట్‌తో విడుదల చేస్తున్నాం. సుకృతిలోని నటనను పద్మ వెలికి తీసింది. తొలిరోజు సుకృతి నటన చూసి ఎంతో ఆనందంగా ఫీలయ్యాను. సినిమాలో మిగతా నటీనటులు కూడా బాగా చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాను ఎన్నో సార్లు చూశాను. చూసిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాను. టీన్స్‌లో వున్న తను సినిమా కోసం హెయిర్ షేవ్ చేసుకుంది. నాకు ఎంతో బాధేసింది ( భావోద్వేగానికి లోనయ్యారు). సుకృతి మల్టీ టాలెంటెడ్.. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
దర్శకురాలు పద్మావతి మాట్లాడుతూ ” ఒక చెట్టుకు, మనిషికి మధ్య ఉన్న అనుబంధంతో ఈ సినిమా ఉంటుంది. సుకృతి నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా విషయంలో సుకుమార్, తబితా సుకుమార్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఈ సినిమా విడుదల తరువాత ‘గాంధీ’గా సుకృతి నటన చూసిన తరువాత అందరికి ఆమెపై మంచి గౌరవం ఏర్పడుతుంది అన్నారు.
సుకృతి బండ్రెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమాను ఎంతో కంఫర్టబుల్‌గా చేశాను. దర్శకురాలు పద్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆమె కోసమే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా కోసం నాన్న ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. ఈ సినిమాలో అందరితో ఎంతో కంఫర్ట్‌గా నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన అందరికి నా థాంక్స్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సింధు, రీ, ఆనంద్ చక్రపాణి, లావణ్య, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…