సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్, ప్రోమోలకు అద్భుతమైన స్పందనతో, సినిమాపై హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మురుగన్ పాట, సునీల్‌తో అతని స్నేహాన్ని చూపించడం కూడా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
ముందుగా మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జూన్ 14కి షిఫ్ట్ చేశారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు బ్రాండ్ న్యూ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఈ వార్తను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 14న నోటెడ్ సినిమా ఏదీ రానందున, హరోం హర సోలోగా విడుదల కానుంది.
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన పీరియాడికల్ ఫిల్మ్.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ రవితేజ గిరిజాల.
తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…