టాలీవుడ్

‘’నారాయణ & కో ‘ టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. ఇటివలే విడుదలైన  ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్,  సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈరోజు ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. టీజర్ నారాయణ, అతని తిక్కల్ ఫ్యామిలీ పరిచయం చేస్తుంది. నారాయణ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి .అతని భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుంది. అతని పెద్ద కొడుకు బెట్టింగ్‌పై ఆసక్తి చూపుతుండగా, అతని చిన్న కొడుకు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నాడు. ఒక యువకుడు, ఒక స్థానిక డాన్ ..రాజకీయ నాయకుడు కావాలని అనుకుంటారు. కొందరు బక్రాల కోసం వెదుకుతుండగా నారాయణ కుటుంబాన్ని ట్రాప్ చేస్తారు, ఇది కామెడీ అఫ్ ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది.

చిన్న పాపిశెట్టి కామెడీని చాలా సమర్ధవంతంగా  హ్యాండిల్ చేశారు. టీజర్ ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఇస్తుంది. సుధాకర్ కామిక్ టైమింగ్ చాలా బాగుంది. చివరి సీక్వెన్స్ హిలేరియస్ గా ఉంది. దేవి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్, జై కృష్ణ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.  

టీజర్ లాంచ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నటించిన వారంతా పెద్ద పొజిషన్ లో వున్నారు. సుధాకర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. తనకు ప్రతిభ, డ్యాన్స్, లుక్స్ , యాక్టింగ్ అన్నీ వున్నాయి. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో తను కోరుకునే స్థాయికి వెళ్తాడని భావిస్తున్నాను. టీజర్ చాలా ఫన్ గా వుంది. ఇలాంటి జానర్ సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓ రెండు గంటలు మనల్ని మనం మర్చిపోయి చూసే సినిమాలివి. అలాంటి ఫ్లావర్, ఎనర్జీ కనిపిస్తుంది. దర్శకుడు చిన్నా చాలా చక్కగా తీశారు. యంగ్ టీం పని చేస్తోంది. ఆమని గారు లాంటి సినియర్ కూడా వున్నారు. సినిమా చాలా కొత్తగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని కోరారు.

సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు. చాలా బిజీలో ఉన్నప్పటికీ మా కోసం వచ్చారు. ఇది జీవితంలో మర్చిపోలేని విషయం. ’నారాయణ & కో ‘లో ఒక నిర్మాతగా కూడా వున్నాను. దీనికి కారణం ఎప్పటి నుంచో మంచి కంటెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచన వుండేది.  దర్శకుడు చిన్న చాలా మంచి కథతో వచ్చారు. ’నారాయణ & కో .. కోట్లాది మందికి రీచ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా.  క్రైమ్ కామెడీ. మిడిల్ క్లాస్, క్రైమ్ కామెడీ  క్రేజీ కాంబినేషన్. అందుకే తిక్కల్ ఫ్యామిలీ అన్నాన్. దేవి ప్రసాద్, ఆమనీ గారితో పాటు మిగతా వారంతా కూడా అద్భుతంగా నటించారు’’ అన్నారు  

ఆమని మాట్లాడుతూ.. ’నారాయణ & కో ‘ లో డ్రీం రోల్ చేశాను. ఎప్పటి నుంచో ఇలాంటి పాత్ర చేయాలని వుంది. ఒక ఆర్టిస్ట్ గా తృప్తిని ఇచ్చిన పాత్రని ఇచ్చిన దర్శకుడు చిన్నా గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడి పని చేసింది. దేవి ప్రసాద్ గారు కూడా కీలక పాత్ర చేశారు. సుధాకర్ తన ప్రతిభ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.  

చిన్నా పాపిశెట్టి మాట్లడుతూ.. ’నారాయణ & కో ‘ లో క్లీన్ కామెడీ వుంటుంది.  ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది. సుధాకర్ గారు వచ్చిన తర్వాత నిర్మాణ భారం సగం తగ్గిపోయింది.  షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాం. టీ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ ఈవెంట్లో సినిమా యూనిట్  అంతా పాల్గొన్నారు.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్  సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్.  శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.  రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ , శరద్ గుమాస్టే అసోసియేట్ ప్రొడ్యూసర్.

తారాగణం: సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

సాంకేతిక విభాగం:
బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
నిర్మాతలు: పాపిశెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల
సహ నిర్మాత: శ్రీనివాస్ గొర్రిపూడి
అసోసియేట్ నిర్మాత: శరద్ గుమస్తే, రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల & నాగ వంశీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
డీవోపీ: రాహుల్ శ్రీవాత్సవ్
అడిషినల్ DOP: సిద్దం మనోహర్
కథ: రవితేజ జి
డైలాగ్స్: రాజీవ్ కె
సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్ & ప్రణతి.
కొరియోగ్రఫీ: విజయ్ పోలాకి & మోహన్ కృష్ణ
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
కాస్ట్యూమ్ డిజైనర్: మానస నాయుడు ఎ
పబ్లిసిటీ డిజైనర్: మాని
ఆర్ట్ డైరెక్టర్: రవి దొండపాటి
ప్రొడక్షన్ మేనేజర్: టేకుమూడి రాజు
పీఆర్వో : వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హాష్‌ట్యాగ్ మీడియా
లైన్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ రెడ్డి వెన్నపూస
క్యాషియర్: కిరణ్ అనుభమ్

Tfja Team

Recent Posts

షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు.

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…

59 seconds ago

The movie Shopping Mall has completed 14 years..

Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…

2 mins ago

LikeReady Dhoom Dhaam’Should Also Be a Blockbuster SrinuVaitla

Chetan Krishna and Hebah Patel are playing the lead roles in the film Dhoom Dham.…

25 mins ago

రెడీ సినిమాలా ధూం ధాం కూడా బ్లాక్ బస్టర్ కావాలి ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీనువైట్ల

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…

25 mins ago

నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రేసీ థ్రిల్లింగ్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యంగ్ అండ్ డైన‌మిక్ యాక్ట‌ర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ సుధీర్…

17 hours ago

Nikhil Appudo Ippudo Eppudo Trailer Out Now

Young and dynamic actor Nikhil Siddhartha is all set to impress with his upcoming film…

17 hours ago