రేపు బాలల దినోత్సవం (Children’s Day) సందర్భంగా…

Must Read

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాపై బ్ర‌హ్మ‌స్త్రంగా భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన లఘుచిత్రం “అభినవ్ “

“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల లఘు చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు.

గ్రామీణ ప్రాంతాల్లో హరిజన, గిరిజన విద్యార్థులు గంజాయి మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఎలా తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తు వల నుంచి పిల్లలు ఎలా బయటపడాలి. విద్యార్థి దశ నుంచే దేశ రక్షణ కోసం బాల బాలికలు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలతో “అభినవ్ “(chased padmavyuha) చిత్రాన్ని దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించారు.

దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – నేను రూపొందించిన ఆదిత్య సినిమాకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, నంది పురస్కారం, కొన్ని ప్రైవేట్ సంస్థల పురస్కారాలు దక్కాయి. ఆ తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలనే కాన్సెప్ట్ తో రూపొందించిన విక్కీస్ డ్రీమ్ లఘు చిత్రం బొంబాయి ఫిలిం ఫెస్టివల్ పురస్కారంతో పాటు మరికొన్ని అవార్డ్ లు దక్కించుకుంది. డాక్టర్ గౌతమ్ చిత్రంతో డ్రగ్స్ కు బానిసైన విద్యార్థులను ఆ మత్తువల నుంచి బయటపడేసేందుకు యోగ, ధ్యానం ఎలా ఉపయోగపడతాయో చూపించాం. ఇప్పుడు “అభినవ్ “(chased padmavyuha) లఘు చిత్రాన్ని రూపొందించాం. బాల కార్మిక వ్యవస్థ, గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు గంజాయి మాఫియా చేతుల్లో కీలు బొమ్మలుగా మారి తమ బంగారు భవిషత్ ను ఎలా పాడుచేసుకుంటున్నారు అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. అలాగే ధనవంతులైన పేరెంట్స్ పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇవ్వాలని డబ్బు పెద్ద మొత్తంలో ఇవ్వడం ద్వారా వారిని చెడగొడుతున్నారు. డ్రగ్స్ మాఫియా నుంచి పిల్లలు ఎలా బయటపడాలి. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకుని దేశరక్షణలో వారు ఎలా భాగం కావాలేనిది “అభినవ్ “(chased padmavyuha) చిత్రంలో తెరకెక్కించాం. దీన్ని అన్ని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపించాం. నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మి మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు.

నటీనటులు – స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర, తదితరులు

టెక్నికల్ టీమ్ – కెమెరా – సామ‌ల భాస్క‌ర్‌, సంగీతం – వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, ఎడిట‌ర్ – నంద‌మూరి హ‌రి, పీఆర్ఓ – చందూ రమేష్, సమర్పణ – శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్, బ్యానర్ – సంతోష్ ఫిలిమ్స్, నిర్మాత, దర్శకత్వం – భీమగాని సుధాకర్ గౌడ్.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News