టాలీవుడ్

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా సంయుక్తంగా ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌’

  • స్థలాభావం, సమయాభావం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ కథలను చెప్పడానికి అనువుగా స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఫెసిలిటీని కల్పిస్తున్న ది ఎఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌

హైదరాబాద్‌, మే 15, 2023: ఇండియన్‌ మీడియా బిజినెస్‌లో దిగ్గజాలు అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా హైదరాబాద్‌లో ది ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ని ఏర్పాటు చేశాయి. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్‌ కెమెరా విజువల్‌ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి వీలవుతుంది. ఎఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ ఈ విషయం మీద 2022 అక్టోబర్‌ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్‌ వీడియోలను కూడా షూట్‌ చేసింది.

వాటన్నిటినీ పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్‌ నాణ్యత బావుందని ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి హద్దులూ లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్‌ గోల్స్ అచీవ్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కటింగ్‌ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్‌, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్‌ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్‌ రేట్‌, వైడ్‌ కలర్‌ గమట్‌) ఉన్న ఎల్‌ఈడీ వాల్‌ స్పాన్నింగ్‌ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్‌ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్‌ కస్టమ్‌ బిల్ట్ రెండరింగ్‌ సిస్టమ్స్, అన్‌రియల్‌ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్‌ వర్చువల్‌ లొకేషన్స్ ని రియల్‌ టైమ్‌ రెండరింగ్‌ చేయడం వంటివన్నీ అద్భుతమైన అంశాలు.

వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్‌, వర్చువల్‌ ఎలిమెంట్స్ బ్లెండ్‌ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా షూటింగ్‌ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.

మీడియా, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది అన్నపూర్ణ స్టూడియోస్‌. సాంప్రదాయబద్ధమైన సినిమా స్టూడియోగా మొదలై, ప్రొడక్షన్‌ హౌస్‌తో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ స్టూడియో ఏర్పాటు చేసి వ్యక్తిగతమైన సేవలను అన్నీ హంగులతోనూ ముందుంచుతోంది. మీడియా ఇండస్ట్రీలో తరాలుగా సేవలందిస్తోంది అన్నపూర్ణ బ్రాండ్‌. ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లోనే కాదు, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకుంటూ, బిజినెస్‌ మోడల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా క్యూబ్‌ సినిమా ప్రస్థానం చెప్పుకోదగ్గది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రొడక్షన్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు సునాయాసంగా జరగడానికి తనవంతు దోహదపడుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ చేయీ చేయీ కలిపి మొదలుపెట్టిన ఈ తాజా ప్రయాణం మెచ్చుకోదగ్గ వినోదాత్మక పర్యావరణానికి, వర్చువల్‌ ప్రొడక్షన్‌కి ఎంతగానో దోహదపడుతుంది. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో మరో ఆసక్తికరమైన మజిలీని చూడనుంది. ”మా వినియోగదారులకు కట్టింగ్‌ ఎడ్జి సర్వీసులు అందించడానికి ఏఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ తనవంతు కృషి చేస్తుంది” అని అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్‌ అక్కినేని నాగార్జున. ”సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు.

”అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కోసం మేం ఈ అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం” అని అన్నారు. క్యూబ్‌ సినిమా కో ఫౌండర్‌ పంచపకేశన్‌. ”కంటెంట్‌ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం. ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్‌, కాస్ట్ ఎఫెక్టివ్‌ మేనర్‌లో మేం ఈ వెసులుబాటు తీసుకొస్తున్నాం. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో వర్చువల్‌ ప్రొడక్షన్‌ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో మేం ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

ఏఎన్నార్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గేమ్‌ చేంజర్‌గా నిలవనుంది. విశ్వ యవనిక మీద భారతీయ వినోదరంగాన్ని ముందంజలో నిలపడానికి అది ఉపయోగపడుతుంది. భారతదేశంలో అత్యుత్తమమైన ప్రప్రథమమైన ఐసీవీఎఫ్‌ఎక్స్ పర్మనెంట్‌ స్టేజ్‌ ఇదే. లాజిస్టిక్స్, ప్రొడక్షన్‌లోనూ పొదుపుచేయడానికి అత్యుత్తమమైన మార్గం ఇది. ప్రాంతాలను, సమయాన్ని పట్టించుకోకుండా తాము చెప్పదలచుకున్న విషయాన్ని సృజనాత్మకంగా చెప్పగలిగిన వెసులుబాటు ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులో ఉంది.

మరింత సమాచారం కోసం vps@annapurnastudios.com and vps@qubecinema.com ని సంప్రదించండి.

అన్నపూర్ణ స్టూడియో గురించి!
అన్నపూర్ణ స్టూడియో (www.annapurnastudios.com) సినిమా ఇండస్ట్రీ నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. 1976లో ప్రారంభించారు. పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్మే అవార్డు గ్రహీత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఏఎన్నార్‌ స్థాపించిన ఈ సంస్థ చలనచిత్రలు, టీవీ, డిజిటల్‌ షోస్‌, స్పెషల్‌ ఈవెంట్స్, అడ్వర్‌టైజింగ్‌ కమర్షియల్స్, మ్యూజిక్‌ వీడియోస్‌తో పాటు పలు వీడియోలను షూట్‌ చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది.

దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ స్టూడియో. హైదరాబాద్‌లో హార్ట్ ఆఫ్‌ ది సిటీగా పేరు తెచ్చుకుంది. ఫిల్మ్ ప్రొడక్షన్‌కి ఒన్‌స్టాప్‌ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అనే నమ్మకాన్ని సొంతం చేసుకుంది. ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ తో లోపలికి వెళ్తే, పూర్తిస్థాయి సినిమాతో బయటకు వచ్చే విధంగా అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది. వినోద రంగంలో దాదాపు 70 ఏళ్ల అనుభవం కలిగిన సంస్థ ఇది. ప్రొడక్షన్‌, సర్వీస్‌, డిస్ట్రిబ్యూషన్‌ రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఈ సంస్థ ఫైనాన్సి అందించిన సినిమాలు, నిర్మించిన సినిమాల సంఖ్య దాదాపు 50కి పైమాటే. అన్నపూర్ణ బ్యానర్‌లో తెరకెక్కిన పలు సీరీస్‌లు ప్రైమ్‌ టైమ్‌ తెలుగు చానెల్స్ అయిన జీ టీవీ , మాటీవీల్లో ప్రసారమయ్యాయి. తన సేవల విస్తరణలో భాగంగా డిజిటల్‌ స్పేస్‌లోనూ అన్నపూర్ణ స్టూడియో తనదైన ప్రతిభను కనబరుస్తోంది. మల్టిపుల్‌ లీడింగ్‌ ప్లాట్‌ఫార్మ్స్ కి కంటెం్‌ అందిస్తోంది.

ఫిల్మ్ అండ్‌ మీడియా ఇండస్ట్రీలకు అన్నపూర్ణ స్టూడియోస్‌ అందిస్తున్న సేవలు అనితరసాధ్యమైనవి. 11 షూటింగ్‌ ఫ్లోర్లతో, అద్భుతమైన లొకేషన్ల ఫెసిలిటీస్‌తో ఫిల్మ్ అండ్‌ మీడియా ఇండస్ట్రీకి అందుబాటులో ఉంది ఈ సంస్థ. స్టేట్‌ ఆఫ్ ది ఆర్ట్ టీపీయన్‌ సర్టిఫికెట్‌ పొందిన సంస్థ ఇది. డాల్బీ అప్రూవ్డ్ పోస్ట్ ప్రొడక్షన్‌ ఫెసిలిటీలున్న సంస్థగానూ గుర్తింపు పొందింది. డేటా స్టోరేజ్‌, వీడియో ఎడిటింగ్‌, ఆడియో డబ్బింగ్‌, 4కె కలర్‌ గ్రేడింగ్‌, విజువల్‌ ఎఫెక్స్ట్, వరల్డ్ క్లాస్‌ డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ మిక్సింగ్‌ మాస్టరింగ్‌ వంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

అన్నపూర్ణ గ్రూప్‌ తరఫున అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ మీడియాకు సాయం అందుతూనే ఉంటుంది. భారతదేశంలో ఫస్ట్ నాన్‌ ప్రాఫిట్‌ ఫిల్మ్ స్కూల్‌గా పేరుంది అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ మీడియాకు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీలు, మాస్టర్స్, ఎంబీఏ కోర్సులు ఫిల్మ్ అండ్‌ మీడియా రిలేటెడ్‌ సబ్జెక్టుల్లో అందిస్తోంది.

క్యూబ్‌ సినిమా గురించి…
క్యూబ్‌ సినిమా (www.qubecinema.com)కు సినిమా రంగంలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సినిమా టెక్నాలజీలోనూ, సొల్యూషన్స్ లోనూ అందెవేసిన చేయిగా గుర్తింపు ఉంది.
సినిమా బిజినెస్‌లో దశాబ్దాల తరబడి అనుభవం ఉంది క్యూబ్‌ సినిమాకు. ఇండస్ట్రీలోని ఫిల్మ్ మేకర్స్ కి డిజిటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ని సమకూర్చడంతో పాటు ఎగ్జిబిటర్స్, ఆడియన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్‌ ఫెసిలిటీలను కూడా కల్పిస్తోంది. క్యూబ్‌ త్రీ ప్రాడెక్టులను ఫిల్మ్ మేకింగ్‌ నుంచి ఎగ్జిబిషన్‌ ప్రాసెస్‌ వరకు ప్రతి స్టెప్‌లోనూ వాడుతున్నారు.

క్యూబ్‌ సినిమా ప్రాడెక్టులు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. నమ్మశక్యంగానూ, అందుబాటు ధరల్లోనూ ఉంటాయి. క్యూబ్ వైర్‌, గ్లోబల్‌ కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్వీస్‌: క్యూబ్‌ ఎక్స్ పీ, ఫోర్త్ జనరేషన్‌ డీసీఐ కంప్లియంట్‌ డిజిటల్‌ సినిమా సర్వీసర్స్: క్యూబ్‌ మాస్టర్‌, ఫ్యామిలీ ఆఫ్‌ డిజిటెల్‌ సినిమా మాస్టరింగ్‌ సాఫ్ట్ వేర్‌ సొల్యూషన్స్: ఐ కౌంట్‌, కెమెరా బేస్డ్ ఆక్యుపెన్సీ మెజర్‌మెంట్‌ సొల్యూషన్స్: స్టైడ్స్, జస్ట్ ఇన్‌ టైమ్‌ డిజిటల్‌ సినిమా ప్యాకేజెస్‌: ఛీర్స్, మూవీ ఆడియన్స్ కి బిగ్‌ స్క్రీన్‌లో పర్సనలైజ్డ్ గ్రీటింంగ్‌‌ కార్డులు: జస్ట్ స్టిక్స్, క్లౌడ్‌ బేస్డ్ సాస్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌: మూవీ ఇన్‌ఫర్మేషన్‌ కోసం మొబైల్‌ యాప్స్, మూవీ బఫ్‌ వెబ్‌సైట్‌. ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా ఎస్టాబ్లిష్‌ అయింది క్యూబ్‌ ప్రాడక్ట్. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో వేల కొలది ఇన్‌స్టాలేషన్స్ ఉన్న సంస్థ ఇది.

గ్లోబల్‌ సినిమా బిజినెస్‌కి అనువుగా కావాల్సిన అన్ని హంగులనూ అమరుస్తోంది క్యూబ్‌ సర్వీస్‌. దేశ వ్యాప్తంగా 4వేల స్క్రీన్స్ ఉన్నాయి. ప్రతి ఏటా భారతదేశంలోని ఆరు ప్రదేశౄల నుంచి 1,800 సినిమాలను మాస్టర్స్ చేస్తోంది. డిజైన్‌, ఈపీఐక్యూ బ్రాండ్‌ కింద ప్రీమియమ్‌ లార్జ్ ఫార్మ్ స్క్రీన్స్ డిజైన్స్, డెలివర్స్ చేస్తోంది. క్యూబ్‌ సినిమా నెట్‌వర్క్ లో పేటెంటెడ్‌ అడ్వర్టైజింగ్‌ నెట్వర్క్ ఉంది. మూవీ సెలక్షన్‌ లోకల్‌ కంట్రోల్‌తో పాటు యాడ్స్ సెంట్రల్‌ కంట్రోల్‌ కూడా ఇందులోనే ఉంది.

వీటికి సంబంధించిన అదనపు సమాచారం కోసం సంప్రదించండి:
అన్నపూర్ణ స్టూడియోస్‌

Tfja Team

Recent Posts

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional…

23 mins ago

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ రహస్య ఇదం జగత్‌ దర్శకుడు కోమల్‌

మీ నేపథ్యం ఏమిటి:నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్‌. అమ్మ…

23 mins ago

Erra Cheera Movie Glimpse Release Event Movie Release On Dec 20

The film "Erra Cheera - The Beginning" is jointly produced by Sri Padmayal Entertainment and…

1 hour ago

ఎర్రచీర సినిమా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్. డిసెంబర్ 20న మూవీ విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర -…

1 hour ago

షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు.

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…

1 hour ago

The movie Shopping Mall has completed 14 years..

Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…

1 hour ago