టాలీవుడ్

‘సాక్షి’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శ‌రణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా ప‌రిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది వరకు విడుదల చేసిన సినిమా పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్, విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌, సినిమా టీజర్‌లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి వెనకాల ఉండి ఆర్.యు.రెడ్డి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూవీతో శరణ్‌కు మంచి పేరు రావాలని, కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న శివకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆర్.యు.రెడ్డి మాట్లాడుతూ.. ‘నా ఆప్తుడు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు ధన్యవాదాలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ చిన్న సినిమాకు పెద్ద మనసు చేసుకుని వచ్చారు. ఆయన ఈవెంట్‌కు రావడమే మొదటి విజయం. మీడియా సహకారం మా టీంకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ గారికి ధన్యవాదాలు. జూలై 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయాల’ని అన్నారు.

హీరో శరణ్ మాట్లాడుతూ.. ‘సాక్షి సినిమా రిలీజ్ డేట్‌ను వి.వి.వినాయక్‌ గారు రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మీడియా, ప్రేక్షకుల సహకారం కావాల’ని అన్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘టీం అంతా సహకరించింది. భీమ్స్ మంచి సంగీతాన్ని అందించారు. హీరో శరణ్ ఎంతో చక్కగా నటించారు. మా సినిమా జూలై 21న రాబోతోంది. అందరి సహకారం కావాల’ని కోరారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ సినిమాలకు సంగీతమందిస్తున్న భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. సాక్షి సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది.

న‌టీన‌టులు : శ‌ర‌ణ్ కుమార్‌, జాన్వీర్ కౌర్, నాగబాబు, ఆమని, ఇంద్రజ

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌ : శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌
స‌మ‌ర్ప‌ణ‌ : ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య
నిర్మాత‌ : మునగాల సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం : శివ కేశ‌న కుర్తి
సినిమాటోగ్ర‌ఫీ : చైత‌న్య కందుల‌
మ్యూజిక్‌ : భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్‌ : కె.వి.ర‌మ‌ణ‌
ఎడిట‌ర్‌ : సెల్వ కుమార్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

20 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago