శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్ కె చంద్ర, 14 రీల్స్ ప్లస్ అనౌన్స్ మెంట్

Must Read

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ డిఫరెంట్ జోన్ లో వున్నారు. వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

#BSS10 చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని  గొప్ప నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది,  #BSS10 పై క్యురియాసిటీని జనరేట్ చేస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు

తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం :
సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News