శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటూ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ ” ఈ రోజు నా సక్సెస్‌కు కారణం నా టీమ్. ఈ వేదికపై ఈ రోజు నేను ఉండటానికి, సినిమా జనాల్లో రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణారెడ్డి గారు. ఈసినిమాకు ప్రీమియర్స్ దగ్గర నుంచే మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సినిమా విడుదల తరువాత అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ ఇంకా ఆడియన్స్ నుంచి మరింత సపోర్ట కావాలి. ఈ సినిమా చూసి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంతకు ముందు తెలుగు నుంచి మలయాళ వాళ్లకు ప్రశంసలు వచ్చేవి. ఇప్పుడు మా సినిమాకు మలయాళం నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు మీ మౌత్‌టాక్‌తో మరింత మందికి చెప్పండి. ఈ సినిమా ఈరోజు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మా టెక్నిషియన్స్ కూడా కారణం. వాళ్లకు నా కృతజ్క్షతలు’ అన్నారు.
చింత గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ” కొత్త టీమ్‌తో చేసిన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. సినిమా చూసిన వాళ్లు బాగుందని ఫోన్ చేస్తున్నారు. కొత్త టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ విజయానికి కారణమైన అందరికి థ్యాంక్స్. నిర్మాతగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హ్యపీగా ఉన్నాను. మా ప్రయత్నంలో ఉన్న నిజయితీని గుర్తించారు. త్వరలో మరో కొత్త దర్శకుడితో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను’ అన్నారు.
వంశీ తుమ్మల మాట్లాడుతూ ” నా మొదటి సినిమాకే ఇంత మంచి అప్లాజ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరూ హీరోనే. నా పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఫోటోగ్రఫీతో, సంగీతంతో మరో లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ సంగీతాన్ని, విజువల్స్‌ని థియేటర్‌లో అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చిదంబరం ప్రపంచంలోకి వచ్చిన అందరూ కొత్త అనుభూతికి లోనవుతున్నారు’ అన్నారు.
సంధ్య వశిష్ట మాట్లాడుతూ ” శ్రీ చిదంబరం గారు’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాకు అందరూ పాజిటివ్ రివ్యూస్ రాశారు. లీల పాత్ర అందరికి నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది. మా నిర్మాత మా లాంటి కొత్త టాలెంట్‌ను మరింత మందిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఇదొక క్లీన్ రీఫ్రెషింగ్ స్టోరీ తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది అన్నారు.
ఈ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్‌లో బాలనటుడు శశికిరణ్, నిర్మాత రమణా రెడ్డి, డీఓపీ అక్షయ్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి, చందు తదితరులు పాల్గొన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…