శ్రీ చిదంబరం గారు సినిమాతో వాళ్ల మనోభావాలు సంతృప్తి చెందుతాయి: దర్శకుడు వినయ్‌ రత్నం

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా దర్శకుడు వినయ్‌ రత్నం మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించాడు. ఆ విశేషాలివి.

‘శ్రీ చిదంబరం గారు’ అనే ఈ కథ ఎందుకు చెప్పాలనుకున్నారు?
ఈ ప్రజెంటేషన్‌ మోర్‌ ఇన్‌ఫరియట్‌ కాంప్లక్స్‌, ఇన్‌సెక్యూరిటీస్‌తో ఫీలవుతూ వాళ్ల లైఫ్‌ను కాన్పిడెంట్‌గా లీడ్‌ చేయాలేకపోతున్నారు. పక్కవాళ్లకు ఉన్నవి చూసి మనకు అవి లేవు కదా అని కంపేర్‌ చేసుకుంటున్నారు. ఈ టైమ్‌లో చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే ఇలాంటి కథను సున్నితమైన భావోద్వేగాలతో చెప్పాలని అనుకున్నాను.

ఈ కథ ద్వారా మీరు ఎలాంటి అంశాన్ని డీల్‌ చేస్తున్నారు?
అద్దంలో నిలబడి మనల్ని మనం చూసుకుని మనం బాగున్నామని ముందు మనం నమ్మాలి. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలి అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలి అనేది ఈ కథ సారాంశం.
మీ నేపథ్యం ఏమిటి:? ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
25 షార్ట్‌ ఫిల్మ్‌ చేశాను. రాజమండ్రి మాది. నిహారిక కొణిదెల గారి సమర్పణలో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కోసం ఓ షార్ట్‌ ఫిల్మ్‌చేశాను. థియేట్రికల్‌గా ఇది మొదటి సినిమా. మొదట ఈ సినిమా క్రౌడ్‌ ఫండింగ్‌తో స్టార్ట్‌ చేశాము. ఆ తరువాత నిర్మాత చింతా గోపాల కృష్టారెడ్డి గారి ఈ కథ నచ్చి ప్రొడ్యూస్‌ చేశాడు.

ఈసినిమాలో ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగింది?
ఈ సినిమాలో చిదంబరం అనే పాత్రకు సింగిల్‌ టేక్‌లో ప్లే చేయాలి. ఈ కథ అనుకున్నప్పుడే వంశీని హీరోగా అనుకున్నాను. మెల్ల కన్నుతో ఈ పాత్ర చేయడం అంతా ఈజీ కాదు .దానికి చాలా ప్రాక్టిస్‌ కావాలి. ఇక మిగతా ఆర్టిస్టులందరిని ఈస్ట్‌ గోదావరిలో అడిషన్‌ తీసుకుని, నేచురాలిటి కోసం రాజమండ్రిలో అడిషన్‌ తీసుకుని అక్కడి వాళ్లనే తీసకున్నాను. అందర్ని వర్క్‌షాప్‌ ద్వారానే తీసుకున్నాను.

ఈ సినిమా ప్రీమియర్స్‌కు ఎలా స్పందన వస్తోంది?
సినిమా చూసిన వాళ్లందరూ చాలా ఫ్రెష్‌ సినిమా చూశామని అన్నారు. కేరాఫ్‌ కంచరపాలెం , పెళ్లి చూపులు సినిమాతో కంపేర్‌ చేస్తున్నారు. నేను ఈ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఆ సినిమాలతో నా సినిమాను పోల్చడం ఆనందంగా ఉంది.

ఈ సినిమాలో వినోదానికి ఎంత వరకు స్కోప్‌ ఉంది?
ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం కాదు. ప్యూర్‌ ఎమోషనల్‌ జర్నీ ఇది. కాకపోతే ఈ సినిమాలో ఎవ్వరిని ఇబ్బంది పెట్టని క్లీన్‌ కామెడీ ఉంటుంది.
మీ రియల్‌లైఫ్‌లో శ్రీ చిదంబరం గారు పాత్ర తరహా మనుషులు తారసపడ్డారా?
చాలా మంది స్నేహితులని చూశాను. ఇన్‌సెక్యూర్‌డ్‌గా ఫీలవుతున్న వాళ్లందరు ఈ సినిమా కథకు ఇన్‌స్పిరేషన్‌. ఇప్పటికీ నా స్నేహితుడు జయంత్‌. యూఎస్‌లో ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్లడు. ఎవ్వరిని ఇబ్బందిపెట్టాడు. వాడ్ని చూసి ఈ కథ చెప్పాలని అనిపించింది.

ఈ సినిమాలో సంగీతం ఎలా ఉంటుంది?
ఈ సినిమాకు మ్యూజిక్‌ ఎంతో ప్రాణం. అయిదు పాటలు ఉంటాయి. కీరవాణి గారు పాడిన పాటతో పాటు అన్ని పాటలు బాగుంటాయి. అన్ని పాటలు కథను చెబుతాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంటుంది.

విజువల్స్‌ చూస్తుంటే కేరళలో చిత్రీకరణ చేశారని అనిపిస్తుంది?
షూటింగ్‌ లోకేషన్స్‌ 32 డేస్‌లో చేశాం. ట్రాన్స్‌పోర్ట్‌ సరిగ్గా లేని లోకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ చేశాం. కేరళలో చిత్రీకరణ చేశారా? అని అందరూ అంటున్నారు. ఈ కాంప్లిమెంట్‌ను నేను ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏపీలో చాలా మంచి లోకేషన్స్‌ చాలా మంచివి ఉన్నాయి. మనం వాడుకోవాలి అంతే.

ఈ సినిమా హీరో పాత్ర కొందరి మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది కదా?
ఈ సినిమాతో అన్ని హ్యాండిల్‌ చేయడం నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన ఎవ్వరికి మనోభావాలు దెబ్బతీనవు. వాళ్ల మనోభావాలు సంతృప్తి పొందుతాయి.

శ్రీ చిదంబరం గారు అనే టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?

మెల్లకన్ను ఉన్నా వాళ్లను ఈస్ట్‌ గోదావరిలో చిదంబరం అని ఏడిపిస్తుంటారు. ఈ సినిమాలో కూడా హీరోని చిదంబరం అని పిలిచి పిలిచి అతన్ని వర్జినల్‌ పేరు కూడా మరిచిపోతాడు సినిమాలో ఇక కథ విన్న తరువాత పాత్ర మీద రెస్పక్ట్‌ పెరిగి శ్రీ చిదంబరం అన్నాం. ఫైనల్‌ కాపీ చూసుకున్న తరువాత మరింత మర్యాద పెరిగి శ్రీ చిదంబరం గారు అని పెట్టాం.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago