‘స్పిరిట్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్ కె.క్రాంతి మాధవ్ రా అండ్ రూటెడ్ మూవీ ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ టైటిల్  అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్‌ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్‌కి ‘దిల్ దియా ..ఏ నేక్డ్ ట్రూత్’ ఆయన ఇప్పటివరకు చేసిన భావోద్వేగాత్మక సినిమాల ప్రయాణానికి కొనసాగింపులానే ఉంటుంది. ఆయ‌న త‌న సినిమాల్లో ఎమోష‌న్స్‌లో డెప్త్‌తో పాటు బ‌ల‌మైన క‌థ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయ‌న తెర‌కెక్కించిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ప్రేమ, మ‌న‌సుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్ర‌ల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మ‌రోసారి క్రాంతి మాధ‌వ్‌ వైవిధ్య‌మైన మూవీ ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సినిమాలో నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు ప్రేమ‌, మోహం, వైఫ‌ల్యం, వ్య‌క్తులు లేదా మ‌న‌సుల మ‌ధ్య ఉండే సానిహిత్యం, ఆత్మ గౌర‌వం వంటి ఎలిమెంట్స్‌పై ఫోక‌స్ చేస్తూ  వంటి ఎమోష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

చైత‌న్య‌రావు మాదాడి, ఇరా, స‌ఖి, జెస్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ణి చంద‌న‌, ప్ర‌మోదిని, వీర శంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సినిమా నేచుర‌ల్‌గా ఉండాల‌నే ఆలోచ‌న‌తో డైరెక్ట‌ర్ అండ్ టీమ్ న‌టీన‌టుల‌ను ఎంపికలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల సినిమాలో ఓవ‌ర్ డ్రామా లేకుండా నేచురాలిటీ క‌నిపిస్తుంది. ఎమోష‌న్స్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి.

ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గ‌మ‌నిస్తే.. బ‌ట్ట‌లు లేకుండా సొఫాలో కూర్చున్న చైత‌న్య రావును చూడొచ్చు. త‌ను ర‌గ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియ‌స్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్ట‌ర్ లైటింగ్ వ‌స్తోంది. త‌న చూపుల్లోని ఇంటెన్సిటీ త‌న పాత్ర‌లోని సీరియ‌స్‌నెస్‌ను తెలియ‌జేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయ‌కుండా , పాత్ర‌లు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ క‌లుగుతుంది. ఈ విజువల్ శైలి క్రాంతి మాధవ్‌ సినిమా దృక్పథానికి దగ్గరగా ఉంది, అక్కడ స్టైల్‌ కన్నా భావోద్వేగాల నిజాయితీ, స్పష్టతకే ఎక్కువ ప్రాముఖ్య‌త క‌నిపిస్తోంది.

‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ మూవీని పూర్ణ నాయుడు నిర్మిస్తుండ‌గా శ్రీకాంత్ వి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి ఫణి క‌ళ్యాణ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. రా-షా (ర‌వి-శ‌శాంక్‌) ఎడిట‌ర్‌గా, చిన్నా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, ధ‌ని ఏలే ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌గా, స్టార్ సర్కిల్ డిజిట‌ల్ మార్కెటింగ్, ఎస్‌.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)  పి.ఆర్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

యువతను దృష్టిలో పెట్టుకొని, లోతైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా దిల్ దియా – ఏ నేక్డ్‌ ట్రూత్ మూవీ రూపొందుతోంది. ఆధునిక సంబంధాలను నిజాయితీగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించేలా సినిమా రూపొందుతోంది. ప్రేమ‌తో పాటు  భావోద్వేగాల సంక్లిష్టతను, వాటి వల్ల వచ్చే ఫ‌లితాలు నేరుగా చూపిస్తూ, నేటి తెలుగు సినిమాలో సన్నిహితత్వానికి కొత్త అర్థాన్ని ఇచ్చేలా సినిమా తెర‌కెక్కుతోంది.

దర్శకుడి స్పష్టమైన విజన్‌, బలమైన క్రియేటివ్ సపోర్ట్‌తో ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సినిమాను బాక్సాఫీస్‌కు కొత్త భాషను పరిచయం చేసే చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు: చైత‌న్య‌రావు మ‌దాడి, ఇరా, స‌ఖి, జెస్సీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్‌: శ‌్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కె.క్రాంతి మాధ‌వ్, నిర్మాత :  పూర్ణ నాయుడు, స‌హ నిర్మాత‌:  శ్రీకాంత్.వి, సినిమాటోగ్ర‌ఫీ:  పి.జి.విందా, సంగీతం:  ఫ‌ణి క‌ళ్యాణ్‌, ఎడిటింగ్‌:  రా- షా (ర‌వి- శ‌శాంక్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  చిన్నా, ప‌బ్లిసిటీ డిజైన్‌:  ధ‌ని ఏలే, డిజిటల్ మార్కెటింగ్: స‌్టార్ స‌ర్కిల్‌, పి.ఆర్‌.ఒ:  ఎస్‌.కె.నాయుడు, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా)

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago