విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రం స్పీడ్220. హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించిన ఈ చిత్రంలో హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. వీరి సరసన ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ పనులు ముగించుకొని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కమిటెడ్ గా ఉన్నారు. స్పీడ్220 చిత్రం నుంచి ప్రతీ ప్రొమోషనల్ వీడియో, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఊపేసింది. బెజవాడలో బాలా కుమారి అనే స్పెషల్ సాంగ్ ప్రముఖ సింగర్ గీతామాధురి ఆలపించగా స్నేహ గుప్తా డ్యాన్స్ కుమ్మెసింది. ప్రస్తుతం మంచి వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ తరుణంలో మరో సాంగ్ సైతం విడుదల చేశారు మేకర్స్. మొదటిది నరాలు జివ్వుమనే ఐటమ్ బాంబ్ అయితే సెకండ్ ది గుండెను పిండేసి ఎమోషనల్ మెలోడి సాంద్. హే పిల్లా అంటూ సాగే ఈ పాట భావోద్వేగాలతో నిండి హృదయాన్ని బరువెక్కించేలా చేస్తుంది. సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, శ్రీదీప్ ప్రాణం పెట్టి ఆలపించారు. శేఖర్ మోపూరి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట యూట్యూలో దూసుకుపోతుంది.
ఇప్పటికే సెన్సార్ సభ్యులు స్పీడ్ 220 చిత్రానకి రివ్యూ ఇచ్చారు. అన్ని భావోద్వేగాలు సమపాలల్లో ఉన్నాయని, మంచి సినిమా అవుతుందని పేర్కొన్నారు. సినిమా కచ్చితంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ సైతం నమ్మకంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింప చేసేలా ఈ చిత్రం ఉంటుందని, నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు మేకర్స్ వెల్లడించారు. యూత్ కు కనెక్ట్ అయ్యే టైటిల్ స్పీడ్220 సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది. పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ కథ ఎంటో తెలియాలంటే జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.
చిత్రం: స్పీడ్220
నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ
హీరోలు: హేమంత్, గణేష్
హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ
డ్యాన్సర్: స్నేహ గుప్తా
కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి
సింగర్ : గీతమాధురి
డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన
పీఆర్ఓ : హరీష్, దినేష్
కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…