‘మనం’ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ, తెలంగాణలో స్పెషల్ షోలు

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ గా నిలిచింది.

‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు.

ఈ మ్యాజికల్ అప్డేట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ #మనం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.

మనం నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 10 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి తిరిగి థియేటర్లలోకి తీసుకువస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది #ANRLivesOn” అని హీరో నాగ చైతన్య ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసింది.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి మెస్మరైజ్ చేయబోతోంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

13 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

13 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago