‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత డా. సురేష్ బాబు

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్

అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఇప్పటి వరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు. ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్‌కి బ్రేక్ వచ్చింది. ఇంకా పది, ఇరవై లక్షల మంది సినిమాని చూస్తే టీంకు లాభాలు వస్తాయి. కంటిన్యూగా పబ్లిసిటీ చేయండి. కోరుకున్న విజయం దక్కుతుంది.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ఎన్నో చిన్న చిత్రాలు తీసి సక్సెస్‌ను చూశాను. మళ్లీ ఈ ‘హుషార్ పిట్టలు’ మూవీని అందరితో కలిసి థియేటర్లో చూసి, ఆ సక్సెస్‌ను చూడటం ఆనందంగా అనిపించింది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది. ‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల థియేటర్లో రిలీజ్ చేశాం. ఆల్రెడీ 25 సెంటర్లో స్క్రీన్స్ పెంచాం. ఇప్పటి వరకు కోటి ముప్పైఆరు లక్షల గ్రాస్ వచ్చింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు భిక్షు మాట్లాడుతూ .. ‘కంటెంట్ ఈజ్ కింగ్ అని మళ్లీ మా ‘హుషార్ పిట్టలు’ నిరూపించింది. మాకు ఈ జర్నీలో సహకరించిన మీడియాకి థాంక్స్. మాకు ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమా సక్సెస్ అవ్వడం అవ్వడం ఆనందంగా ఉంది. మా జర్నీ ఈ రామానాయుడు స్టూడియో నుంచి ప్రారంభం అవ్వడం, సక్సెస్ కొట్టడం సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారి చేతులు పడితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బెక్కం సార్, సురేష్ బాబు సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మంచి సినిమా తీశాం. ఇలాంటి చిన్న చిత్రాలు ఇంకా ముందుకు వెళ్లాలి. మేం ఆడియెన్స్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. మా సినిమా మున్ముందు మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అన్ష్ మాట్లాడుతూ .. ‘డెబ్యూతోనే ఇంత మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సినిమా తీయడం సులభం. కానీ రిలీజ్ చేయడం కష్టం. మా మూవీని నమ్మి రిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి థాంక్స్. అయ్యప్ప స్వామి రూపంలో సురేష్ బాబు గారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించినట్టుగా అనిపిస్తుంది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అమ్మానాన్నలకు థాంక్స్. టీజర్ చూసి రాఘవేంద్రరావు గారి టీం నుంచి ఆఫర్ ఇచ్చారు. ఇక వంద శాతం కష్టపడి పని చేస్తాను. మున్ముందు అద్భుతమైన కథల్ని అందిస్తాను’ అని అన్నారు.

వాసవి గణేశన్ మాట్లాడుతూ .. ‘అమ్మ లాంటి డైరెక్టర్, నాన్న లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. ‘హుషారు పిట్టలు’ చిత్రంతో నాకు ఎంతో మంది అన్నయ్యలు దొరికారు. సాయి అన్న నన్ను ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. భాను అన్న, నవీన్ అన్న, లక్కీ అన్న నన్ను బాగా చూసుకున్నారు. ఆర్టిస్టులంతా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ సర్, చిరంజన్ సర్ వల్లే ఇంత అద్భుతమైన స్పందన వస్తోంది. అన్ష్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి థాంక్స్’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి షాక్‌లో ఉన్నాను. ఇది నా సినిమానేనా? అని కలలో ఉండిపోయాను. నా సక్సెస్‌ను అందరూ సెలెబ్రేట్ చేస్తున్నారు. చరణ్ అర్జున్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ బాగున్నాయ్ అని నా ఇతర చిత్రాల దర్శకులు కూడా కేక్ తీసుకు వచ్చి సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. అడల్ట్ కంటెంట్ ఉందని ఎవరైనా చెప్తే నమ్మకండి. సెన్సార్ వాళ్లు యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడండి.’ అని అన్నారు.

కెమెరామెన్ రుద్రసాయి మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అనేది టీం ఎఫర్ట్. తెర వెనకాల ఎంతో మంది కష్టపడ్డారు. నా ఫ్రేమ్ గానీ, నా వర్క్ గానీ బాగుందంటే అది నా టీం వల్లే. చరణ్ అన్న సాంగ్‌కి సినిమాటోగ్రఫీ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకి బెక్కం సార్ చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

లిరిక్ రైటర్ చిరంజన్ మాట్లాడుతూ .. ‘‘కంటెంట్ అనేది కింగ్ అయితే.. హిట్ అనే గిఫ్ట్‌ని ఆడియెన్స్ ఇస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను రాసిన పాటలు, అందులోని లైన్స్‌ గురించి చాలా మంది పాడుతున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.

నటుడు గోవర్దన్ మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ టీజర్ చూసి అందరూ విమర్శించారు. అలా విమర్శించిన వారే సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. నా 25 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అవకాశాల్ని కోల్పోయాను. నా కెరీర్‌లో ‘హుషార్ పిట్టలు’ మైలు రాయి లాంటి చిత్రంగా నిలుస్తుంది’ అని అన్నారు.

నటుడు రమేష్ మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఈ సక్సెస్ మీట్‌లో ఇతర ఆర్టిస్టులు సునీత మనోహర్, అంజి వల్గుమాన్, ప్రణీత, భాను, బాలు తదితరులు పాల్గొన్నారు.

తారాగణం : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్, అంజి వల్గుమాన్ తదితరలు

సాంకేతిక సిబ్బంది:
సమర్పణ : పద్మమ్మ, B.V.G స్టూడియోస్
బ్యానర్: రుద్ర క్రాంతి పిక్చర్స్
విడుదల : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: కె. వెంకట్ యాదవ్
దర్శకుడు: బిక్షు
సంగీతం: చరణ్ అర్జున్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి
ఆర్ట్ డైరెక్టర్: గాదె శివ కుమార్
గీత రచయిత: S.S చిరంజన్
డిజైన్స్: మాయాబజార్
PRO : మాడూరి మధు

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago