‘స్పార్క్L.I.F.E’.. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న

క్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ భారీ బ‌డ్జెట్ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘స్పార్క్L.I.F.E’.. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ

యంగ్ హీరో విక్రాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. మెహ‌రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టించారు. 

రీసెంట్‌గా ‘స్పార్క్L.I.F.E’ షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు మేక‌ర్స్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంలో బిజీగా ఉంది. ఎమోష‌న్స్‌, ల‌వ్‌, భారీ యాక్ష‌న్స్ సీక్వెన్సుల‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సినిమాటోగ్రాఫ‌ర్ ఎ.ఆర్‌.అశోక్ కుమార్ సినిమాటోగ్ర‌పీ, హేషం అబ్దుల్ వ‌హాబ్ సంగీతం, నేప‌థ్య సంగీతం హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. 

ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీని వ‌రల్డ్ వైడ్‌గా న‌వంబ‌ర్ 17న రిలీజ్ చేయ‌నున్నారు. హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఆడియెన్స్ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని, మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago