టాలీవుడ్

సోహెల్‌ సినిమా 44 రోజుల్లోనే పూర్తయిపోయింది.

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామహైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విచ్చేసి ట్రైలర్‌, టీజర్‌లను లాంచ్‌ చేశారు.ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ… కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్‌.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్‌ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది.

కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్‌. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్‌ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్‌ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్‌ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్‌ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్‌ సభ్యులకు నా కృతజ్ఞతలు అన్నారు.నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ… చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్నా మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శేఖర్‌ కమ్ముల గారికి నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి గారు, నేను చిరకాల మిత్రులం. ఈ సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యామిలీస్‌ అందరూ థియేటర్స్‌కు రావడం మానేసి ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఫ్యామిలీస్‌ను థియేటర్స్‌కు రప్పించే కంటెంట్‌ సినిమాల్లో తగ్గి పోవడమే. అటువంటి కంటెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ కృష్ణారెడ్డిగారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో మళ్లీ థియేటర్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయి అని నాకు గట్టి నమ్మకం.

ఇక రాజేంద్రప్రసాద్‌ నా హీరో, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. మీనాగారు అయితే ఆమె భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని భావించి, ఆయన చనిపోయిన దాదాపు 15 రోజుల తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు. మరొక ఆర్టిస్ట్‌ అయితే ఇలా ఖచ్చితంగా సహకరించి ఉండేవారు కాదు. కల్పనా చిత్ర బ్యానర్‌ 1970ల్లో స్టార్ట్‌ అయ్యింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఇప్పటికీ నిలబడిరది. ఇది చాలా గర్వకారణమైన విషయం. ఈ సినిమా విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఏమీ లేదు. అంతా మా ఆవిడ కల్పనే చూసుకుంది. ఆమెకు, కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్‌ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్‌ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్‌ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఆర్గానిక్‌ మామ ` హైబ్రిడ్‌ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్‌, ప్లానింగ్‌ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నా కెరీర్‌లో ది బెస్ట్‌ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఆ సమయంలో అచ్చిరెడ్డి ఫోన్‌ చేసి, రేయ్‌ నువ్వు ఖాళీగా ఉంటే అద్భుతంగా వచ్చిన ఈ కథను మళ్లీ మెరుగులు దిద్దుతూ పాడుచేస్తావేమో అనిపిస్తోంది. ఓపని చెయ్‌.. ఈ కథను అలాగే లాక్‌ చేసేసి దీనికి మాటలు రాయి అన్నాడు. దానికి నేను మాటలు రాయడం ఏంట్రా.

అని నా పని కాదు కదా అన్నాను. దానికి వాడు డైరెక్షన్‌ నీ పనా? కథ రాయడం నీపనా?, స్క్రీన్‌ప్లే నీ పనా?, సంగీతం నీ పనా? అవన్నీ చేయలేదా.. ఏంటి?. ఈ మాటలు కూడా రాయగలవు. నేను చెపుతున్నా రాయి అన్నాడు. అచ్చిరెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అయ్యా.. ఇప్పుడు ఈ సినిమాకు మాటలు కూడా రాశాను. మేం పేపర్‌ ఎడిటింగ్‌ చేసుకుంటాం. ఏదైనా సీన్‌ గానీ, డైలాగ్‌ గానీ చెబితే.. అది ఎన్ని నిముషాలు, ఎన్ని సెకన్లు వస్తుందో కూడా అచ్చిరెడ్డి పర్‌ఫెక్ట్‌గా చెప్పేయగలడు. అలా రెడీ అయిన ఈ స్క్రిప్ట్‌ను కల్పన గారికి వినిపించగానే ఆమె షాక్‌ అయ్యారు. ఇంత మంచి స్క్రిప్ట్‌ మనం స్క్రీన్‌ మీద పెట్టక పోతే ఎలా.. మనం ఈ సినిమా చేసేస్తున్నాం అంతే అని ఆ క్షణంలోనే ఫిక్స్‌ అయిపోయారు. ఆరోజు నుంచి 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆమె ఎలా ప్లాన్‌ చేశారో నాకు అయితే తెలియదు. ప్రతి రోజూ లొకేషన్‌లో నాకు కావాల్సినవి, కావాల్సిన టైంకు సమకూరాయి అంతే. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్‌ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్‌ సంపాదించారు. రాజేంద్రప్రసాద్‌ గారు అయితే.. డబ్బింగ్‌ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్‌ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఆయన నటనలో ఒక అద్భుతం అంతే. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి ఆమె సూపర్‌ నటి. ఈ సినిమా టైటిల్‌ కల్పనగారే పెట్టారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది. ఇంతమంచి ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు. బహుశా కల్యాణ్‌గారి భార్య కాబట్టే ఆయన నుంచి ప్రొడక్షన్‌ ఎలా చేయాలో ఆకళింపు చేసుకుని ఉంటారు. సోహెల్‌ను సంతోషం సురేష్‌ నాకు పరిచయం చేశారు. అతను కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్‌ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే..

యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. ఇంత మంచి కంటెంట్‌ను తెరకెక్కించడంలో కెమెరామెన్‌ సి. రాంప్రసాద్‌ గారు అద్భుతంగా పనిచేశారు. ఆయన ఎక్కడా రాజీపడే వ్యక్తి కాదు. డబ్బింగ్‌లో సినిమా చూస్తుంటే రాంప్రసాద్‌ మేజిక్‌ చూసి మురిసిపోయాను. ఫైట్స్‌, ఎడిటింగ్‌ ఇలా ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌ ఒక తపనతో పనిచేశారు. దాని రిజల్ట్‌ త్వరలో తెరమీద చూడబోతున్నారు అన్నారు.ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారితో సినిమా చేయాలని కల్పనగారు చాలాసార్లు అన్నారు. ఈ కథ వినగానే ఆమెకు బాగా నచ్చి, సి. కల్యాణ్‌ గారికి చెప్పారు. నీకు నచ్చితే ఓకే అని ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక ఆమె మమ్మల్ని జెట్‌ స్పీడ్‌లో పరుగెత్తించారు. ఒక నిర్మాతగా ఆమె స్పీడ్‌ను, కమాండ్‌ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రస్తుత జనరేషన్‌కు ఇది పర్‌ఫెక్ట్‌ సినిమా. కృష్ణారెడ్డి గారి మార్క్‌ ఇది. కల్పన గారికి సినిమా మార్కెటింగ్‌లో కూడా చాలా అనుభవం ఉంది. పైగా వెనకాల సి. కల్యాణ్‌ గారు ఉన్నారు. సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లో ఆయనకున్న అనుభవం ఎనలేనిది. మంచి టీం ఈ సినిమా కోసం పనిచేసింది. త్వరలోనే ఆడియోను సరిగమ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేస్తాం అన్నారు.హీరో సోహెల్‌ మాట్లాడుతూ… నేను చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాకు ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావటానికి ముఖ్య కారకులైన సంతోషం సురేష్‌ గారికి నా కృతజ్ఞతలు. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్‌. బిగ్‌బాస్‌ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కష్టపడినట్టే ఇక ముందు కూడా కష్టపడుతూనే ఉంటాను అన్నారు.నటుడు ఆలీ మాట్లాడుతూ… ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్‌. పైగా మామ, అల్లుడు కాంబినేషన్‌ అనేది హిట్‌ ఫార్ములా.

కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్‌ అయినట్టే భావించాలి. నిర్మాత కల్పనగారు యూనిట్‌ను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. సోహెల్‌ తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. కృష్ణారెడ్డి గారి హ్యాండ్‌ పడిరది అంటే ఇక సోహెల్‌ స్టార్‌ అయినట్టే. మా గురువుగారు కృష్ణారెడ్డి గారికి మళ్లీ ఈ సినిమా పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ… ఎస్వీ కృష్ణారెడ్డి గారు అంటే క్రమశిక్షణకు మారుపేరు. సినిమా ఓపెనింగ్‌ రోజునే విడుదల తేదీని కూడా ప్రకటించే గట్స్‌ ఉన్న నిర్మాతల దర్శకుడు ఆయన. నిర్మాత కల్పన గారు అనేక డబ్బింగ్‌ సినిమాలను ఇటు తెలుగులోకి, అటు ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ చేయడం ద్వారా అందరికీ చిరపరిచితురాలు. ఈ సినిమా కోసం ఆమె ఎంతగా కష్టపడ్డారో మాకు తెలుసు. ఇవాళ ప్రేక్షకుడికి కావాల్సింది కంటెంట్‌. అది ఉన్న ఏ సినిమాను అయినా ప్రేక్షకులు చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా లేకుండా ఆదరించి కాసులు కురిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ కన్నడ సినిమా ‘కాంతారా’. అలా కంటెంట్‌ను నమ్ముకుని స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా సక్సెస్‌ అయి అందరికీ మంచి పేరు తెస్తుంది అన్నారు.దర్శకుడు, పంపిణీదారుడు ముత్యాల రాందాస్‌ మాట్లాడుతూ… కృష్ణారెడ్డిగారి సినిమా అనగానే ట్రేడ్‌లో చాలా ఎంక్వయిరీ జరుగుతోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగానే టైటిల్‌ పెట్టడం కూడా కృష్ణారెడ్డి గారు ఎంత అప్‌డేట్‌గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

నిర్మాత కల్పన మేడమ్‌ ఈ సినిమా విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. తప్పకుండా మంచి సక్సెస్‌ సాధిస్తుంది అన్నారు.నటి హేమ మాట్లాడుతూ… ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కల్పన గారు ప్రతి పాత్ర విషయంలో చాలా కేర్‌ తీసుకున్నారు. అలాగే యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్‌లాగా కేర్‌ తీసుకున్నారు. హీరో సోహెల్‌ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మంచి పాత్రను నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్‌ గారు ఈ సినిమాకు పిల్లర్‌ వంటి వారు. కృష్ణారెడ్డి గారి గత చిత్రాల్లానే ఇందులో కూడా మంచి కథ, పాటలు, వినోదం ఉంటాయి అన్నారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. కల్పన గారు ప్రొడక్షన్‌ అంటే ఇలా ఉండాలి అని చేసి చూపించారు. కల్పన గారికి ఈ సినిమా సూపర్‌సక్సెస్‌ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్‌ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఈ సినిమాకు ఎంత ఎస్సెట్టో నేను చెప్పాల్సిన పనిలేదు. వారి కాంబినేషన్‌ అలాంటిది. యూనిట్‌ అందరికీ నా ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

19 hours ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

19 hours ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

20 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

20 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

21 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

21 hours ago