శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన సిద్ది, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తెరు చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక ఫ్యామిలీ, విలేజ్, కామెడీ చిత్రంగా ఆడియెన్స్‌ని మెప్పించేందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ‘సోగ్గాడిలా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
‘సోగ్గాడిలా’ సాంగ్ ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తోంది. ఈ పాటలో హీరో చుట్టూ హీరోయిన్ తిరగడం, హీరోయిన్ చేసే అల్లరి అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు గిరిధర్ రాగోలు సాహిత్యం.. లిప్సిక, సుధాన్షు గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ కుమార్ బూసం ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. గ్రామీణ వాతావరణం ఈ వీడియో సాంగ్‌లో మరింత అందంగా కనిపిస్తోంది.
ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా, సెల్వ కుమార్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు : స్కంద, మోహన సిద్ధి, శ్రుతి శంకర్
సాంకేతిక బృందం
బ్యానర్ : స్కంద ఫిల్మ్స్
సమర్పణ :శరణ్య-సుధీక్ష
నిర్మాత :కృతాక్షి
దర్శకుడు :తెరు చలపతి కుమార్ పువ్వల
కెమెరామెన్ :కిషోర్ బోయిడపు
ఎడిటర్ :సెల్వ కుమార్
ఫైట్స్ : దేవరాజ్ మాస్టర్
కొరియోగ్రఫీ: గోపీ రాయ్
పీఆర్వో : సాయి సతీష్

