చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ‘భవానీ వార్డ్ 1997’ చిత్రాన్ని జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘భవానీ వార్డ్ 1997’ ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను నేనే లాంఛ్ చేశారు. సాయి సతీష్ పిలవడం వల్లే నేను ఇక్కడకు వచ్చాను. సినిమా రిలీజ్‌ టైం దగ్గర పడుతుంటే టీంకు ఓ టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశారు. అది వీళ్ల మాటల్లోనే అర్థం అవుతోంది. ఇక ఆడియెన్స్ ఇచ్చే రిజల్ట్ కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. వీళ్ల టెన్షన్ పోగొట్టేందుకు, మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చాను. కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు హారర్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ ఇవ్వాలి. ఫిబ్రవరి 7న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు జి.డి. నరసింహా మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు గారు మాకోసం వచ్చి సపోర్ట్ చేశారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సాయి సతీష్ గారికి థాంక్స్. మా సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. గణేష్, పూజా కేంద్రే ఇలా అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ మీ అందరినీ భయపెట్టేలా ఉంటుంది. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అదే రోజున తండేల్ కూడా రాబోతోంది. అన్ని సినిమాలు చూసి సపోర్ట్ చేయండి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారందరికీ మా భవానీ వార్డ్ 1997 నచ్చుతుంది’ అని అన్నారు.

గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. సీరియల్స్ నుంచి సినిమాకి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. మేం పడ్డ కష్టాన్ని ఎవ్వరూ చూడరు. అందరూ అవుట్ పుట్‌నే చూస్తారు. ఈ సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వదినమ్మ సీరియల్‌లో నాని పాత్రతో అందరూ నన్ను గుర్తు పడతారు. నన్ను మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సాయి సతీష్ గారికి థాంక్స్. జి.డి. నరసింహ నాకు దర్శకుడిగా మాత్రమే కాకుండా సొంత బ్రదర్‌లా మారిపోయారు. పూజా కేంద్రే అద్భుతంగా నటించింది. మా చిత్రం ఫిబ్రవరి 7న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

పూజా కేంద్రే మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పూర్తి హారర్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుంది. ప్రతీ సీన్ చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రంతో నేనేంటో ఆడియెన్స్ అందరికీ తెలుస్తుంది. మా టీంను అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ‘రేవు సినిమా తరువాత ఈ చిత్రాన్ని చూశాను. దర్శకుడు చాలా తక్కువగా మాట్లాడతాడు. కానీ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. మా సాయి సతీష్ అద్భుతంగా నటించాడు. ఇకపై ఆర్టిస్ట్‌గా బిజీ అవుతాడేమో అని అనిపిస్తోంది’ అని అన్నారు.

సాయి సతీష్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రాజ్ కందుకూరి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌ ఇస్తూనే ఉంటారు. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్‌లా వెన్నంటే ఉంటారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నిస్సి జస్టిన్ మాట్లాడుతూ.. ‘‘భవానీ వార్డ్ 1997’ సినిమాను నాకు ఇచ్చిన దర్శకుడు జీడీ నరసింహ గారికి థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఫిబ్రవరి 7న మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

కెమెరామెన్ అరవింద్ మాట్లాడుతూ.. ‘‘భవానీ వార్డ్ 1997’ సినిమాకు ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా చివరకు సినిమాను ఫినిష్ చేశాం. ఫిబ్రవరి 7న ఈ మూవీని ఆడియెన్స్ మందుకు తీసుకు రాబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన దర్శక, నిర్మాతలకు, ఆర్టిస్టులకు థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago