సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా
“స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్
దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. తాజాగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా
నుంచి ఫ్రస్టేషన్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. పాట కాన్సెప్ట్ బాగుందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే…ఇట్స్ ఏ మెడిటేషన్ సాంగ్ నహీ, ఇరిటేషన్ సాంగ్ నహీ, డిప్రెషన్ సాంగ్ నహీ, ఇట్ ఈజ్ ఫ్రస్టేషన్ సాంగ్ ..అంటూ సాగుతుందీ పాట. ఈ పాటకు పూర్ణా చారి
సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి
పాడారు. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ ను చెబుతూ ఈ పాట డిజైన్ చేశారు. ఈ పాటలో సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం.
ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో
నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ – వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ –
శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం – కాసర్ల
శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి, పీఆర్వో – జీఎస్కే
మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి, బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ, సహ
నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల,
ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం, నిర్మాతలు – అప్పిరెడ్డి,
వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…