టాలీవుడ్

ఈనెల 29న రిలీజ్ అవుతున్న ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ హ్యూమరస్ గా ఉండటం, మ్యారేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ కొత్త పాయింట్ ను చూపెట్టడం ఆసక్తిని కలిగించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సకుటుంబంగా ప్రేక్షకులు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఉన్నారు. సినిమా టీమ్ కూడా మూవీ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ నెల 29 డేట్ ను లాక్ చేసుకోమని వారు ప్రేక్షకుల్ని కోరుతున్నారు.

బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ కీ రోల్స్ చేస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
ఎడిటర్ – వైష్ణవ్ వాసు,
సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో – జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి
బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ
సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల
ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం
నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

1 hour ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

1 hour ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

2 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

2 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

3 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

3 hours ago