శివకార్తికేయన్‌ లాంచ్ జివి ప్రకాష్‌ కుమార్‌ కింగ్‌స్టన్‌ ఫస్ట్‌ లుక్‌

Must Read

నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, ట్యాలెంటెడ్ యాక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంటెంట్-బేస్డ్ మూవీ ‘కింగ్స్టన్’లో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని స్టార్ హీరో శివకార్తికేయన్‌ లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.

Zee స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఉమేష్ Kr బన్సాల్ మాట్లాడుతూ..”ప్రేక్షకులకు ప్రత్యేకమైన, ఆకట్టుకునే కథలను అందించడంలో మా నిబద్ధతకు కింగ్స్టన్ నిదర్శనం. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన ప్రతిభ, విజన్ గల టీంతో, ఈ ఫాంటసీ అడ్వంచర్ సముద్రపు నేపథ్యాలు వీక్షకులను ఆకట్టుకునేలా వుంటుంది” అన్నారు

కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జివి ప్రకాష్, దివ్య భారతి లీడ్ రోల్స్ పోషించారు, ఇందులో ‘మెర్కు తొడార్చి మలై’ ఫేమ్ ఆంటోని, చేతన్, కుమారవేల్, & సాబు మోహన్‌లతో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ధివేక్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. ఎడిటింగ్‌ పనులను శాన్‌ లోకేష్‌ పర్యవేక్షిస్తుండగా, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.మూర్తి పనిచేస్తున్నారు. హారర్-అడ్వెంచర్ జానర్‌కి చెందిన ఈ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ చేశారు, దీనిని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పెద్ద కాన్వాస్‌పై నిర్మించాయి. దినేష్ గుణ క్రియేటివ్ ప్రొడ్యూసర్.

జివి ప్రకాష్ కుమార్ కింగ్‌స్టన్‌లో అనేక ప్రత్యేక అంశాలలో పాలుపంచుకున్నారు. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ఈ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఇది నటుడిగా అతని 25వ చిత్రం. ఇంకా, ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన జీ స్టూడియోస్‌తో అతని సహకారం అంచనాలను పెంచింది.

ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.

Latest News

DaakuMaharaaj WillReference Point for other Films Bobby

The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide release on January 12,...

More News