బ్లాక్‌బస్టర్ జోడీ శివాజీ, లయ నటిస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల..

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన భార్య ఉత్తరగా డిఫరెంట్ పాత్రలో లయ నటించారు.

ఎంతో అమాయకంగా, సాంప్రదాయబద్ధంగా జీవించే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని విచిత్రమైన, ఊహించని నేరాల్లో ఎలా ఇరుక్కుంది..? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి..? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ కథను నడిపించినట్లు అర్థమవుతోంది. క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్‌కు రంజిన్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, మాస్టర్ రోహన్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ కామెడీ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago