‘హీరో’ చిత్రంతో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్ సినిమా ప్రిమైజ్ ని ప్రజెంట్ చేసింది. టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్‌లతో అద్భుతమైన పాటని అందించారు.
ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి మానస పట్ల ఆరాధనని చూపుతుంది. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. పూర్తి సాంగ్ మే3 న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస
సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్
మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…