‘విక్రమ్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘థగ్ లైఫ్’తో రాబోతున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ ను మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. 1987లో వచ్చిన కమల్ హసన్, మణిరత్నం కల్ట్ ఫిల్మ్ ‘నాయకన్’ తర్వాత ఈ లెజండరీ ద్వయం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అద్భుతమైన తారాగణం, అగ్రశేణి సాంకేతిక నిపుణులతో థగ్ లైఫ్ హై బడ్జెట్ తో రూపొందుతోంది.
ఈ చిత్రంలో హీరో సిలంబరసన్ టిఆర్ (శింబు) కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబుని పరిచయం చేశారు మేకర్స్. టీజర్ లో శింబు కార్ లో దుమ్మురేపుతూ వచ్చి గన్ ని గురిపెట్టడం పవర్ ఫుల్ గా వుంది.
కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్స్ పై ఆర్.మహేంద్రన్ శివ అనంతన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ఎంటర్ టైనర్ కి ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అన్‌బరివ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్.
ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, కమల్ హాసన్ లుక్‌లు అద్భుతమైన స్పందనతో అభిమానులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…