టాలీవుడ్

ఘనంగా ప్రారంభమైనసిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1

యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌నెం.1’ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ…
మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్‌ విశ్వజిత్‌ చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్‌ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్‌ రాయడం మరింత ప్లస్‌ అవుతుంది. మంచి హిట్‌ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్‌ కుదిరారు అన్నారు.

దర్శకుడు కార్తి మాట్లాడుతూ…
ఇది నాకు తొలి సినిమానే అయినా మంచి కథ, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు దొరకడం వల్ల చాలా నమ్మకంగా ఉన్నాను. ఫస్ట్‌ సినిమాకే టాప్‌ టెక్నీషియన్స్‌ సెట్‌ అవడం నా లక్‌గా భావిస్తున్నా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్‌లాంటిది. 10వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. మొత్తం 3 షెడ్యూల్స్‌ ఉంటాయి. నన్ను నమ్మి ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు.

హీరో అవినాష్‌ మాట్లాడుతూ…
సినిమాలంటే నాకు చాలా పిచ్చి. నేను చదువుకు కేటాయించిన సమయం కన్నా.. సినిమాల్లో గడిపిన సమయమే ఎక్కువ. నిర్మాతలు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. మంచి కథ సెట్‌ అవడం, దానికి టాప్‌ టెక్నీషియన్‌లు పని చేస్తుండడం మా యూనిట్‌ అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా హిట్‌ ఫిల్మ్‌ ఇస్తాం అన్నారు.

హీరోయిన్‌ సాక్షి చౌదరి మాట్లాడుతూ…
మరో మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. నా క్యారెక్టర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉంది అన్నారు.

రచయిత విశ్వజిత్‌ మాట్లాడుతూ…
ఈ లైన్‌ ఓకే అవ్వగానే సినిమా స్టార్ట్‌చేయలేదు. రియాల్టీ చెక్‌కోసం 6 జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన దాదాపు 150 మందిని సెలక్ట్‌చేసి, వారికి కథచెప్పగా అందరూ చాలాబావుంది అని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత పలు వర్క్‌షాప్‌లు నిర్వహించి కాన్ఫిడెంట్‌గా షూటింగ్‌కు వెళ్తున్నాం అన్నారు.

ఈకార్యక్రమానికి నిర్మాతలు అంబిక కృష్ణ, దామోదర ప్రసాద్‌, తుమ్మలపల్లి, తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌నాయుడులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

అవినాష్‌, సిమ్రాన్‌ చౌదరి, నందు, శివాజీరాజా, సత్య, హర్షవర్ధన్‌, టార్జాన్‌, హర్ష, భాషా, ఆమని, ఈటీవీ ప్రభాకర్‌, సమ్మెట గాంధీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌, డైలాగ్స్‌: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: ఎ. విశ్వనాథ్‌, కథ, స్క్రీన్‌ప్లే:విశ్వజిత్‌ పూరేటి, సంగీతం: వివేక్‌సాగర్‌, ఎడిటర్‌: చోటా కె. ప్రసాద్‌, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తోలేటి యువ కృష్ణ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నాగేంద్ర తంగళ్ల, ఆర్ట్‌: కె.వి. రమణ, అడిషినల్‌ డైలాగ్స్‌: నిఖిల్‌ టాగూర్‌, ధర్మా(ఎస్‌.డి.టి), పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాంబాబు కుంపట్ల, నిర్మాతలు : శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డి, దర్శకత్వం: కార్తీ.

Tfja Team

Recent Posts

జపాన్‌లో తెలుగు మాట్లాడిన అభిమాని.. కదిలిపోయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్…

4 hours ago

దళపతి విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…

3 days ago

“Heart Filled with Gratitude”: Megastar Chiranjeevi Reacts on Prestigious Honour at the House of Commons in the United Kingdom

Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……

1 week ago

‘జాక్-కొంచెం క్రాక్’ సినిమాలో నవ్విస్తూనే బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తాను – హీరో సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…

1 week ago

‘మార్కో’ దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు ప్రొడక్షన్స్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…

1 week ago

‘L2E: ఎంపురాన్’ థియేట్రికల్ ట్రైలర్…

ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌, కంప్లీట్‌యాక్ట‌ర్‌ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌…

1 week ago