స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.
తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కెకె లిరిక్స్ రాశారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ హ్యుజ్ సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించనున్నారు.
ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు.
నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…