సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’ ఏప్రిల్ 10న విడుదల2025

Must Read

సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ యూత్, మాస్ ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్త‌య్యింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. సమ్మర్ కానుకగా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.

ఈ చిత్రంలో సిద్దు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. పూర్తి వినోదాత్మకంగా రాబోతోన్న ఈచిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్‌లో యూనిట్ ప్రారంభించనుంది.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News