‘మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాత లాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను’ అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని నటీ మణి ఈశ్వరీరావు, బాపురమణల పురస్కారాన్ని సినీ దర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పి పి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును బింబిసార చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఉత్తమ నటీ అవార్డును నటీమణి సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్ర అవార్డును బింబిసార ప్రతినిధులు అందుకు న్నారు. లతా మంగేష్కర్ పురస్కారాన్ని నటీ -మణి శ్రీలేఖ, వీఎస్ఆర్ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు స్వీకరించారు. ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశి కాంత్, సుభాష్ చంద్ర విశిష్ట అవార్డులు, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ జీవిత సాఫల్య అవార్డును స్వీకరించారు. అంతకుముందు అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగం వినిపించారు. తర్వాత జరిగిన మేనక పి పి బోరా బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…