ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనున్నట్టు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ రోజు తెలిపారు.
అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరో – హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ నటించారు. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదలవ్వనున్న చిత్రం ‘శివం భజే’. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు.
దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, “ఆగష్టు 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ అన్ని వర్గాల, వయసుల ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది మా ‘శివం భజే’. టైటిల్, టీజర్ తో అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. మా హీరో అశ్విన్ బాబు, ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. మా పాటలు, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం” అన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, “మా ‘శివం భజే’ టీజర్ కి వచ్చిన అనూహ్య స్పందనకి మా అందరి విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలు, నిపుణులని ఖర్చు కి వెనకాడకుండా మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు సహకారం అందించడం, ప్రతీ ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం” అన్నారు.
నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…