బ్యాక్ టూ బ్యాక్ చార్ట్ బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివేరీ చేస్తూ టాలీవుడ్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు శేఖర్ చంద్ర. తాజాగా సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు బైరవకోన’ సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన “నిజమే నే చెబుతున్నా” లవ్ సాంగ్ యూ ట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇన్స్టా లో రీల్స్ తో ట్రెండింగ్ లో ఉంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సంగీతం అందించగా , సిద్ శ్రీరామ్ పాడారు.
శేఖర్ చంద్ర , సిద్ శ్రీరామ్ కాంబినేషన్ లో ఇప్పటికే “బాగుంటుంది నువ్వు నవ్వితే” , “ప్రియతమా ప్రియతమా” , ‘మనసు దారి తప్పేనే’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నాలుగవ సాంగ్ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శేఖర్ చంద్ర ‘నిజమే చెబుతున్నా” సాంగ్ వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ” నిజమే చెబుతున్నా” సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని ఓన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. రిలీజయ్యక చాలా మెస్సేజెస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి ఐ ఆనంద్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్ కి , నిర్మాతలకు థాంక్స్. సిద్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి.ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణి కి కూడా థాంక్స్ చెప్తున్నా. ఈ సాంగ్ మూవీ రిలీజయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…