‘జవాన్’ ట్రైలర్ సిద్ధం..

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జవాన్’ ట్రైలర్ సిద్ధం.. ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రాకింగ్‌’  థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌కు అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ప‌క్కా

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్..  ఏడాది ‘పఠాన్’ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా సెన్సేషనల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై ‘జవాన్’ చిత్రంతో దండ‌యాత్ర చేసి బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్ట‌డానికి రెడీ అయ్యారు. దీని కోసం ఆయ‌న అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘జవాన్’ ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావ‌టానికి మేక‌ర్స్ భారీ స‌న్నాహాలు చేస్తున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో జ‌వాన్ ట్రైల‌ర్‌ను ప్ర‌దర్శించ‌బోతున్నారు. 

ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్‌గా అబ్బుర ప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో  ప్రేక్ష‌కుల‌కు వారి సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అస‌లు ఈ సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త లుక్‌లోకి మారారు. ఆ లుక్‌ను చూసి ఆయ‌న అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. దీంతో షారూక్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందోన‌ని అంద‌రిలో ఉత్కంఠ‌త నెల‌కొంది. దీంతో జ‌వాన్ మూవీ ట్రైల‌ర్‌ను చూడాల‌ని అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల‌తో అభిమానుల‌ను మెప్పించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు జ‌వాన్ చిత్రంలో ఎలా ఆక‌ట్టుకోబోతున్నాడ‌నేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. 

షారూక్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago