బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు ప్రముఖ సంస్థ టి సిరీస్ సొంతం చేసుకోవటం టాక్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీగా మారింది.
‘జవాన్’ సినిమా మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకోవటానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే టి సిరీస్ సంస్థ రూ.36 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకోవటం విశేషం.
‘జవాన్’ చిత్రం మ్యూజిక్ రైట్స్ కోసం రూ.36 కోట్లు రావటం సరికొత్త రికార్డ్. దీంతో షారూక్ ఖాన్ మరోసారి తన స్టార్ పవర్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ‘‘మెగా ఎక్స్‌క్లూజివ్, జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు టి సిరీస్ సొంతం చేసుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. మరోసారి షారూక్ ఖాన్ తన ఆధిపత్యాన్ని చూపించారు’’ అని తెలియజేశారు.
పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారూక్ ఖాన్ చేస్తోన్న సినిమా కావటంతో జవాన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తానికి మ్యూజిక్ రైట్స్ అమ్ముడవటం మరోసారి సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్‌లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…