రికార్డుల వేటలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్..రూ.36 కోట్లకు అమ్ముడైన ‘జవాన్’ మ్యూజిక్ రైట్స్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు ప్రముఖ సంస్థ టి సిరీస్ సొంతం చేసుకోవటం టాక్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీగా మారింది.
‘జవాన్’ సినిమా మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకోవటానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే టి సిరీస్ సంస్థ రూ.36 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకోవటం విశేషం. ‘జవాన్’ చిత్రం మ్యూజిక్ రైట్స్ కోసం రూ.36 కోట్లు రావటం సరికొత్త రికార్డ్. దీంతో షారూక్ ఖాన్ మరోసారి తన స్టార్ పవర్‌ను ప్రూవ్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ‘‘మెగా ఎక్స్‌క్లూజివ్, జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ.36 కోట్లకు టి సిరీస్ సొంతం చేసుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. మరోసారి షారూక్ ఖాన్ తన ఆధిపత్యాన్ని చూపించారు’’ అని తెలియజేశారు.
పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారూక్ ఖాన్ చేస్తోన్న సినిమా కావటంతో జవాన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తానికి మ్యూజిక్ రైట్స్ అమ్ముడవటం మరోసారి సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…