టాలీవుడ్

బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న భారీస్థాయిలో విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్ ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి.

మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అలాగే “మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్.” అని నిర్మాతలు పేర్కొన్నారు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో థియేటర్లలో వినోద అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు నిర్మాతలు.

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే మ్యాడ్ స్క్వేర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సరికొత్త హాస్య చిత్రం ముగ్గురు కాలేజీ స్నేహితుల జీవితాలు, వారి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago