పైలం పిలగా!’ ఫస్ట్ లుక్ పోస్టర్

చిరంజీవికి అభిమానులుంటారు బాలయ్య బాబు కి అభిమానులుంటారు, అమితాబ్ కు ఉంటారు, రజనికి ఉంటారు, సచిన్ కు ఉంటారు, ధోని కి ఉంటారు. కానీ అంబానీకి ఎవరైనా అభిమానులుంటారా? ఒకడున్నాడు, వాడి పేరు శివ…. 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి అర వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేలు , కాదు కోట్లు, కాదు కాదు వేల  కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. కానీ చీమకు ఏనుగు ఆహారంగా దొరికిన పరిస్థితి. ఎత్తుకెళ్లి పుట్టలో పెట్టుకోలేదు, తిని అరిగించుకోలేదు. ఈ లోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ అనే చిరు చీమ  ఏ నిచ్చెనలెక్కి, ఏ చుక్కలనందుకున్నాడో చెప్పే హాస్య భరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా!’

విలువ లేని వ్యవసాయం చేయలేక, వలస పోయి కార్పొరేట్ బానిస అవలేక ఉన్న ఊళ్ళో నే  ఎంట్రప్రెన్యూర్ గా మారి పది  మందికి పని కల్పించి, అంబానీల లక్షలు, కోట్లు సంపాదించాలని అత్యుత్సాహం తో కలలు కన్నా ఓ మధ్యతరగతి యువకుడు, పద్మవ్యూహపు మన బ్యూరోక్రసీ వ్యవస్థ లో సమస్త అవస్థలు పడుతూ ఏ ప్రస్థం చేరుకున్నాడో చెప్పే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా!’

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ నిర్మాణంలో రామకృష్ణ బొద్దుల, S.K . శ్రీనివాస్ నిర్మాతలు గా ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన చిత్రం ‘పైలం పిలగా!’ ఈ చిత్ర పోస్టర్/ఫస్ట్ లుక్ ను ఇటీవల విజయవాడలోని KL యూనివర్సిటీ లో జరిగిన రామ్ మిర్యాల మ్యూజిక్ కన్సర్ట్ లో విద్యార్థులు చేత ఆవిష్కరింప చేసారు. ఇన్నోవేటివ్ గా, ఫన్నీ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ విద్యార్థుల్లో అమితాకసక్తిని  రేపింది.

పిల్ల పిలగాడు వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరో గా, పుష్ప ఫేమ్ పావని కారణం హీరోయిన్ గా , నటించిన ఈ చిత్రంలో దుబ్బింగ్ జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. చౌరస్తా యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం లో ఆరు పాటలను రామ్ మిర్యాల, చిత్ర, శ్రావణి భార్గవి ఆలపించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మన, స్టైలిష్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ వాడ్నలా పని చేసిన ఈ పైలం పిలగా చిత్రానికి సహా నిర్మాతలు గా కృష్ణమసునూరి, రవి వాషింగ్టన్, విజయ్ గోపు వ్యవహరించారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago