సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేతుల మీదుగా “పురుషః” చిత్రం నుంచి ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల


వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్ అంటూ వరుసగా ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది,స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ క్యాప్షన్స్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుష:’ చిత్రయూనిట్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ క్రమంలో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ పాత్రల స్వభావం, వాటి తీరుని ప్రతిబింబించేలా పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్ మీద ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ ఉన్న కంటెంట్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ ఓదెల “పురుషః” చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌లతో పాటుగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా రానున్న ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఆద్యంతం అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

నటీనటులు : పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్,రాజీవ్ కనకాల తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు : వీరు వులవల
సంగీత దర్శకుడు : శ్రవణ్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
ఆర్ట్ : రవిబాబు దొండపాటి
లిరిక్స్ : అనంత శ్రీరామ్
పీఆర్వో : సాయి సతీష్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

11 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago