తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్, ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న క్రేజీ యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సెల్ఫిష్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ వీధుల్లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. వర్కింగ్ స్టిల్స్ లో ఆశిష్ ట్రెండీ లుక్‌లో కనిపించగా, ఇవానా గ్లాసెస్ తో కూల్‌గా కనిపిస్తుంది.
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాట దిల్ కుష్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: ఆశిష్, ఇవానా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రాఫర్: ఆచార్య వేణు
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి
పీఆర్వో: మాడూరి మధు, వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…