ఆశిష్ ‘సెల్ఫిష్’- హైదరాబాద్‌లో షూటింగ్

Must Read

తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్, ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , శిరీష్  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తున్న క్రేజీ యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్‌’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సెల్ఫిష్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ వీధుల్లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. వర్కింగ్ స్టిల్స్ లో ఆశిష్ ట్రెండీ లుక్‌లో కనిపించగా, ఇవానా గ్లాసెస్ తో కూల్‌గా కనిపిస్తుంది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాట దిల్ కుష్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

 తారాగణం: ఆశిష్, ఇవానా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రాఫర్:  ఆచార్య వేణు
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి
పీఆర్వో: మాడూరి మధు, వంశీ-శేఖర్

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News