టాలీవుడ్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు విడుద‌ల కానున్న‌పుష్ప -2 ద రూల్ టీజర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న 11:07 నిమిషాల‌కు ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

ఈ స్టిల్‌లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. రేపు పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవ‌త్స‌రం ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఈ సంవ‌త్స‌రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లొతో పాటు తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం గా నిలిచింది.

అల్లు అర్జున్ తెలుగు గ‌ర్వం అని చెప్పోచ్చుమొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం,మెట్ట మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్ లొ మ్యాడ‌మ్ టుసార్ట్ లో స్టాట్యూ క‌ల‌గ‌ట‌మే కాకుండా మెద‌టి తెలుగు న‌టుడుగా గ్యాల‌రీ ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ఈ సంవ‌త్సరంలో సంత‌రించుకున్నాయి.

ఇక త్వ‌ర‌లోపుష్ఫ 2 తొ మ‌రోక్క‌సారి ప్ర‌పంచం లోని సినిమా అభిమానులంతా ఒక్క‌సారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాలు తెలుగు సినిమా చ‌రిత్రలొ మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్ని ఎదురుచూస్తున్నాయి.. తెలుగువారంద‌రి గౌర‌వాన్ని ప్ర‌పంచ శిఖారాన్ని తాకేలా న‌టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్S

TFJA

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

16 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago