”నాకొక పెళ్ళాం కావాలి” అంటున్న హీరో స్మైల్ శ్రీను”

ఓ మై లవ్, 18 టు 25 బళ్లారి, దర్బార్.. వంటి క‌న్న‌డ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి
టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను ఇప్పుడు తెలుగు కన్నడ భాషల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ చేసి కన్నడ ప్రేక్షకుల మనసులో మంచి పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ఓ మై లవ్ 50 రోజులు పూర్తి చేసుకొని ఘన విజయం సాధించింది. అదే జోష్‌తో ఉన్న స్మైల్ శ్రీను ఇప్పుడు ”నాకొక పెళ్ళాం కావాలి” అనే చిత్రం ద్వారా హీరోగా రానున్నారు.
ఈ చిత్రానికి హరి అల్లినేని దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఇప్పుడు ఈ సినిమా క‌థ‌కు సూట‌య్యే హీరో స్మైల్ శ్రీను కి పిల్లని ( హీరోయిన్) వేతికె పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అలానే కొంతమంది చిత్ర యూనిట్ టెక్నీషయన్లును ఎంపిక చేసే ప‌నిలో ఉన్నారు.

ఈ సందర్భంగా హీరో స్మైల్ శ్రీను మాట్లాడుతూ.. తెలుగు కన్నడ బాషల్లో హీరోగా నా తొలి సినిమా ఇది. తెలుగులో సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కుడు హరి అల్లినేని ఇప్ప‌టికే స్క్రిప్ట్ పని పూర్తి చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సబ్జెక్టు ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది.” అని అన్నారు.

డైరెక్ట‌ర్ హరి అల్లినేని మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా స్క్రిప్టు బాగా వ‌చ్చింది. జనవరిలో సెట్ మీదకి తీసుకెళ్ల‌బోతున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను, టెక్నిక‌ల్, కాస్ట్ ఆండ్ క్రూ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతున్నాం..” అని అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago